For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బలపడిన రూపాయి, స్వల్పంగా పెరిగిన బంగారం ధర

|

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్‌ 345 పాయింట్ల లాభంతో 37,460 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 11,254 వద్ద ముగించాయి. అదే సమయంలో డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి బలపడింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.7 శాతం పెరిగింది. బంగారం ధర స్వల్పంగా పెరిగింది. జ్యువెల్లరీ బంగారంపై రూ.70 పెరిగింది.

గురువారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.3 వద్ద ముగిసింది. గురువారం రూపాయి 70.34 వద్ద క్లోజ్ అయింది. ఇప్పుడు 31 పైసలు బలపడి 70.3 పైసల వద్ద క్లోజ్ అయింది.

Rupee trade at 70.03 per dollar, Gold price rises by Rs.70 to Rs 33,330

గురువారం రోజు దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర జ్యువెల్లరీ కొనుగోలుపై రూ.70 పెరిగి, రూ.33,330కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా రూ.50 పెరిగి కిలో ధర రూ.38,250గా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ ట్రేడింగ్ ఔన్సుకు 1,295.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. న్యూయార్క్‌లో వెండి ఔన్సుకు 14.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఢిల్లీలో పది గ్రాముల 99.9 శాతం, 99.5 శాతం బంగారం ధరలు రూ.70 పెరిగి రూ.33,330 వద్ద, రూ.33,160 వద్ద కొనసాగాయి. సావెరిన్ గోల్డ్ 8 గ్రాములకు రూ.26,500 వద్ద నిలకడగా ఉంది.

English summary

బలపడిన రూపాయి, స్వల్పంగా పెరిగిన బంగారం ధర | Rupee trade at 70.03 per dollar, Gold price rises by Rs.70 to Rs 33,330

In the national capital, gold of 99.9 per cent and 99.5 per cent purity gained by Rs 70 each to Rs 33,330 and Rs 33,160 per 10 gram, respectively. Sovereign gold, however held steady at Rs 26,500 per eight gram.
Story first published: Thursday, May 16, 2019, 17:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X