స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల బాట పట్టింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రోత్సాహక సంకేతాలకు తోడు షార్ట్ కవరింగ్, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్‌లో కొనుగోళ్లు మార్కెట్లను పైకి తీసుకెళ్లాయి. మిడ్ సెషన్ తర్వాత వచ్చిన బూస్టింగ్‌తో నిఫ్టీ 11250 పాయింట్లపైన కంఫర్టబుల్‌గా క్లోజైంది. మూడు వారాల తర్వాత మెరుగైన లాభాలను మార్కెట్ సూచీలు నమోదు చేశాయి. ఒక్క ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలూ లాభాల్లో ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా అరశాతం వరకూ పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 278 పాయింట్ల లాభంతో 37,393 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 100 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 240 పాయింట్లు పెరిగాయి.
జీ ఎంటర్‌టైన్‌మెంట్, బిపిసిఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, సిప్లా స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

టాటాలకు ఎఫ్ఎంసిజి బూస్టింగ్
ఎఫ్ఎంసిజి వ్యాపారాలన్నీ విడదీసి ఒకే గొడుగు కిందికి తీసుకురావడంలో భాగంగా టాటా కెమికల్స్ నుంచి సాల్ట్ బిజినెస్‌ను వేరు చేయడం వంటి అనేక నిర్ణయాల నేపధ్యంలో టాటా గ్లోబల్ బెవరేజెస్ 11 శాతం, టాటా కెమికల్స్ 8.5 శాతం లాభాలతో ముగిశాయి. వివిధ వర్టికల్స్‌ను తొమ్మిది, పదికి పరిమితం చేసి.. వాటిన్నింటినీ ఏకీకృతం చేసే దిశగా టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మొదటి అడుగు పడింది.

క్రూడ్ కూల్..
ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు కాస్త చల్లబడడంతో దేశీయంగా చమురు సంస్థలు కూడా కాస్త ఊపరిపీల్చుకున్నాయి. దీంతో హిందుస్తాన్ పెట్రోలియం 5 శాతం, బిపిసిఎల్ 4.5 శాతం, ఇండియన్ ఆయిల్ 4 శాతం లాభపడ్డాయి

ఇండిగోలో గొడవలు
జెట్ ఎయిర్ ఇబ్బందుల్లో ఉన్న నేపధ్యంలో ఇండిగోను అత్యంత వేగంగా విస్తరించే అంశంపై ప్రమోటర్ల మధ్య విబేధాలు తలెత్తినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇద్దరూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్తున్నారనే ఆందోళన నేపధ్యంలో ఇండిగో స్టాక్ ఈ రోజు ఏకంగా 10 శాతం పతనమైంది. అయితే అలాంటిదేమీ లేదని సంస్థ యాజమాన్యం ఖండించినప్పటికీ స్టాక్‌లో మాత్రం పెద్దగా చలనం లేదు. చివరకు స్టాక్ రూ.1467 దగ్గర క్లోజైంది.

యెస్ బ్యాంక్‌లో ఇంకా అంతే...
యెస్ బ్యాంక్‌లో ఆర్బీఐ డైరెక్టర్‌ను నియమించడం, ఇంకా ఏదో తెలియని అనిశ్చితి బ్యాంకులో ఉందనే అనుమానాలు స్టాక్‌ను 52 వారాల కనిష్టానికి తీసుకెళ్తున్నాయి. ఈ రోజు సుమారు 5 శాతం పతనం యెస్ బ్యాంక్‌ను కుదిపేసింది. చివరకు స్టాక్ రూ. 138 దగ్గర క్లోజైంది.

ఐడియాలో.. నో ఐడియా
ఐడియాలో ఏం జరుగుతోందో.. ఇంకా అర్థం కావడం లేదు. సుమారు రూ.4 వేల కోట్ల నష్టాన్ని ప్రకటించిన సంస్థ నెత్తిన రూ.1.5 లక్షల కోట్ల రుణభారం ఉంది. విపరీతమైన పోటీని తట్టుకుని సంస్థ ఏ స్థాయిలో నిలదొక్కుకుంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ రోజు కూడా స్టాక్ మరో 6 శాతం పడిపోయి రైట్స్ ఇష్యూ ధరకు దిగొచ్చింది. చివరకు రూ.12.20 దగ్గర పతనం ఆగింది. ఇదే టెలికాం రంగానికి చెందిన భారతి ఎయిర్టెల్ కూడా 2 శాతం వరకూ పతనమైంది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications