TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇబ్బంది పడింది ఆయన వల్లేనా?
TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆగమనంతో ఇబ్బందికి గురయ్యారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. TV9 ఛానళ్లను అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయివేటు లిమిటెడ్ సొంతం చేసుకొని పూర్తిస్థాయి యాజమాన్య, నిర్వహణ బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా రవిప్రకాశ్‌కు ఉద్వాసన పలికింది అలంద మీడియా.
అయితే అలంత మీడియా TV9 ఛానళ్లను కొనుగోలు చేసేందుకు కారణమైన రవిప్రకాశ్... అదే సంస్థ నుంచి గెంటివేతకు గురికావడం కొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సంస్థ ఉద్యోగులు సైతం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విశ్వసనీయ సమాచారం. అలంద మీడియాలో MEIL సంస్థకు మరో భాగస్వామిగా చేరిన బడా వ్యాపారవేత్తే.. దీనికి కారణమని చెబుతున్నారు. ఆయన మరెవరో కాదు... జూపల్లి రామేశ్వర రావు అని చెబుతున్నారు.

మై హోమ్ ఇండస్ట్రీస్ అధినేత. తెలంగాణలో అత్యంత ధనిక పారిశ్రామికవేత్త అయిన రామేశ్వర రావు అలంద మీడియా డైరెక్టర్‌గా చేరారు. ఈ ఏడాది జనవరిలోనే రామేశ్వర రావు అలంద మీడియా బోర్డులోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అప్పటి వరకు అలంద మీడియా కేవలం MEIl గ్రూప్ సంస్థ అనుకొన్న రవిప్రకాశ్‌కు కొత్తగా మై హోం గ్రూప్ రామేశ్వర రావు కూడా ఉన్నారని తెలిసి షాక్‌కు గురయ్యారంట. అక్కడి నుంచి ఒకింత అభధ్రతా భావానికి లోనైన రవిప్రకాశ్... అలంద మీడియాకు సహకరించడం లేదని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
అలంద మీడియా ఒక అడుగు ముందుకేసి TV9 ఛానళ్ల పూర్తిస్థాయి రికార్డులపై లోతుగా విశ్లేషణ మొదలు పెట్టిందట. ఈ చర్యలతో ఇబ్బందిపడిన రవిప్రకాశ్ ఎలాగైనా పట్టు కోల్పోవద్దని భావించారట. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో రవిప్రకాశ సీఈవో పదవికి రాజీనామా చేయక తప్పలేదు.


Click it and Unblock the Notifications