డిజిటల్ వాలెట్ పేటీఎం మాల్‌లో భారీ మోసం జరిగినట్లు ఆ సంస్థ గుర్తించింది. క్యాష్ బ్యాక్ రూపంలో ఏకంగా రూ.10 కోట్ల వరకు మోసం జరిగి ఉంటుందని పేటీఎం కంపెనీ వెల్లడించింది. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ 'ఈవై'తో కలిసి రూపొందించిన ప్రత్యేక టూల్‌తో ఈ మోసాన్ని గుర్తించినట్లుగా ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగులు, వ్యాపారులు కుమ్మక్కై రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు క్యాష్ బ్యాక్ మోసం చేశారని ఆ కంపెనీ అంతర్గత విచారణలో వెల్లడైందట.

విక్రేతలు, ఉద్యోగుల తొలగింపు
ఈ మోసం బయటపడిన నేపథ్యంలో వందల కొద్ది విక్రేతలను తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించడంతో పాటు ఉద్యోగులను తప్పించినట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపాడు. సంస్థ అంతర్గత తనిఖీల్లో భారీ మోసం జరిగినట్లు గుర్తించి విచారణ చేపట్టామని, కొందరు చిన్న వ్యాపారులకు భారీగా క్యాష్ బ్యాక్ లభిస్తున్న విషయాన్ని గుర్తించామని, దీనిపై విచారణ చేపట్టడంతో ఈ మోసం బయటపడిందన్నాడు.

పెద్ద ఎత్తున క్యాష్ బ్యాక్
దీపావళి తర్వాత కొంతమంది విక్రేతలకు పెద్ద ఎత్తున క్యాష్ బ్యాక్ లభిస్తుందని తమ టీం గుర్తించిందని, దీనిని మరింత లోతుగా పరిశీలించాలని తమ ఆడిటర్లను కోరామని ఆయన చెప్పాడు. ఆడిటింగ్ సంస్థ నిర్వహించిన లెక్కల్లో కొందరు జూనియర్ స్థాయి ఉద్యోగులు, సంస్థలు కుమ్మక్కై ఈ క్యాష్ బ్యాక్ స్కాంకు తెరతీసినట్లు తేలిందని చెప్పాడు. సంస్థలోని కొంతమంది కిందిస్థాయి ఉద్యోగులు కూడా వారికి సహకరించినట్లు తేలిందని చెప్పాడు.

నకిలీ ఆర్డర్ ద్వారా
నకిలీ ఆర్డర్లను సృష్టించి క్యాష్ బ్యాక్ ద్వారా వచ్చిన సొమ్మును సొంత అకౌంట్లలోకి మళ్లించినట్లుగా గుర్తించినట్లు చెప్పాడు. దీంతో దాదాపు వంద మంది విక్రేతలను తమ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించామని, కొందరు ఉద్యోగులను తీసేశామని కంపెనీ కూడా ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నాడు.
ఘటనలు చోటుచేసుకోకుండా మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో ఈవైతో తమ అనుబంధం కొనసాగుతుందన్నారు. ఇందుకోసం మానవ వనరులతో పాటు, కృత్రిమ మేథను కూడా ఉపయోగిస్తామన్నారు. 'ఈవై'తో తమ అనుబంధం కొనసాగుతుందని చెప్పాడు.


Click it and Unblock the Notifications