జియో దెబ్బకు 3 నెలల్లో వొడాఫోన్-ఐడియా నష్టం - రూ.4882 కోట్లు
మార్చి ముగిసిన గత ఆర్థిక సంవత్సర త్రైమాసికానికి రూ.4882 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది వొడాఫోన్ ఐడియా సంస్థ. దేశ టెలికాం రంగంలో పోటీ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో చేసేది లేక చేతులెత్తేసి ఈ స్థాయి నష్టాన్ని ప్రకటించి ఇంకా పోరాడుతూనే ఉంది వొడాఫోన్ - ఐడియా సంస్థ. డిసెంబర్ క్వార్టర్‌లో రూ.5004 కోట్ల నష్టాన్ని ప్రకటించిన సంస్థ ఇప్పుడు అతి స్వల్పంగా ఆ నష్టాన్ని తగ్గించుకున్నా.. మళ్లీ లాభాల్లోకి రావడం ఇప్పటికిప్పుడు కష్టంగా కనిపిస్తోంది.
రెండు కలిసిపోయాయ్
ఆగస్ట్ 2018లో ఐడియా - వొడాఫోన్ సంస్థలు రెండూ విలీనమయ్యాయి. అప్పటి నుంచి వీటి పేరు వొడాఫోన్ ఐడియాగా ఎక్స్ఛేంజీల్లో కూడా మారింది. జియో నుంచి వస్తున్న తీవ్ర పోటీని తట్టుకోవడానిి రెండు సంస్థలూ ఒక్కటయ్యాయి. ఇక మార్చితో ముగిసిన క్వార్టర్‌లో సంస్థ ఆదాయం రూ.11755 కోట్లుగా ఉంది. అయితే ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే.. భారతి ఎయిర్టెల్ (రూ.10632 కోట్లు), రిలయన్స్ జియో (రూ.11,106 కోట్లు) కంటే ఎక్కువ ఆదాయాన్ని వొడాఐడియా సంపాదించింది.

రూ.35 మినిమం రీఛార్జ్ ఎఫెక్ట్
ఫోన్ సేవలు వినియోగించని ఇన్‌యాక్టివ్ కస్టమర్లను వదిలించుకోవడానికి వొడాఐడియా రూ.35 మినిమం మంత్లీ రీఛార్జ్‌ను పెట్టింది. దీంతో డిసెంబర్ క్వార్టర్‌లో 3.5 కోట్ల మంది, ఇప్పుడు 5.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు దూరమయ్యారు. మొత్తం ఇప్పుడు వీళ్ల దగ్గర 33.4 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ నెత్తిన రూ.1.18లక్షల కోట్ల అప్పు భారంగా ఉంది. అప్పులు, వడ్డీలు కట్టుకుంటూ ఈ కాంపిటీషన్‌లో లాభాలను నమోదు చేయడం ఇప్పుడీ సంస్థకు అతిపెద్ద సవాల్.


Click it and Unblock the Notifications