7 ఇండియన్ టాప్ డ్రగ్ కంపెనీలకు అమెరికాలో షాక్
సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ లిమిటెడ్ సహా ఏడు ఇండియన్ డ్రగ్ మేకర్స్, ఆయా కంపెనీలకు చెందిన ఐదుగురు ఎగ్జిక్యూటివ్స్ పైన అమెరికాలో ఆరోపణలు వచ్చాయి. ఈ డ్రగ్ మార్కెట్స్‌తో పాటు 20 ఫార్మా కంపెనీలపై విమర్శలు చెలరేగాయి. అనుచితంగా ధరల పెంపుకు కుట్ర పన్నారంటూ ఆరోపణలు వచ్చాయి.
అమెరికాలోని 40 రాష్ట్రాలలో మే 10వ తేదీన యాంటీ ట్రస్ట్ లాసూట్ కేసులు ఫైల్ చేసింది. ఈ డ్రగ్ కంపెనీలపై అయిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ లాసూట్ నమదోయింది. ఈ ఫార్మా సంస్థలకు చెందిన అయిదుగురు ఉద్యోగులను కేసులో చేర్చాయి. ఇరవైడ్రగ్ సంస్థలు వేర్వేరు మందుల ధరల్లో దాదాపు 400 శాతానికి పైగా పెంపుకు కుట్ర పన్నాయని ఆరోపణలు వచ్చాయి.

సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్‌తో పాటు ఇండియాకు చెందిన ఇతర డ్రగ్ మేకర్స్... అరబిందో ఫార్మా లిమిటెడ్, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, లుపిన్ లిమిటెడ్, వొఖార్డ్ లిమిటెడ్, జైడస్ ఫార్మాలు ఉన్నాయి. ఈ జాబితాలో ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల తయారీ కంపెనీ టేవా ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉండటం కూడా గమనార్హం.
20 డ్రగ్ మేకర్స్ కలిసి 100 డిఫరెంట్ డ్రగ్స్ పైన కుట్రతో ధరలు పెంచుతున్నట్లుగా ఈ లాసూట్‌లో పేర్కొన్నారు. అందరికీ అవసరమైన మందుల ధరలను కంపెనీలు ఉద్దేశ్యపూర్వకంగా ఈ కంపెనీలు పెంచుతున్నాయని ఈ కేసులు నమోదయ్యాయి.
డయాబెటీస్, క్యాన్సర్, హెచ్‌ఐవీ, మూర్చ వ్యాధి వంటి మందులు సహా ఎన్నో ఔషధాల ధరలను నిర్ణయించడంలో ఈ ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, కుట్రపూరితంగా ధరలు పెంచుతున్నాయని అభియోగాలు నమోదయ్యాయి. అమెరికన్ల జీవితాలతో జనరిక్ మందుల తయారీ రంగంలోని కొందరు వందల కోట్ల డాలర్ల స్కీంకు తెరదీశాడని మత వద్ద బలమైన ఆధారాలున్నాయని కనెక్టికట్ అటార్నీ జనరల్ అన్నారు.


Click it and Unblock the Notifications