రూ.1 ట్రిలియన్ రుణాలు మాఫీ చేసిన SBI! కేవలం అందుకోసమే!!
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్చి 31 (ఆర్థిక సంవత్సరం ముగింపు) నాటికి రెండేళ్లలో 1 ట్రిలియన్ విలువ కలిగిన రుణాలను మాఫీ చేసింది. ఈ మార్చి 31 నాటికి రూ.61,663 కోట్ల రుణాలను మాఫీ చేస్తే, అంతకుముందు ఏడాది రూ.40,809 కోట్ల రుణాలు చేసింది. అంటే ఈ రెండేళ్లలో రూ.1.02 ట్రిలియన్లు. అంతకుముందు మూడు ఫైనాన్షియల్ ఇయర్స్ కంటే ఇది దాదాపు రెండింతలు. అప్పుడు రూ.57,646గా ఉంది. ఈ మాఫీ కారణంగా ఎస్బీఐ ఎన్పీఏ (నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్) 23 శాతం తగ్గి రూ.1.72 ట్రిలియన్లుగా ఉంది.
2019 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ లోన్ రికవరీలు, లోన్ అప్‌గ్రేడ్స్ రూ.31,512 గా ఉన్నాయి. రుణమాఫీలు పెరిగిన విధంగానే బ్యాంక్ రికవరీలు, అప్ గ్రేడ్స్ కూడా అదేవిధంగా పెరిగాయి. 31 మార్చి 2017 నాటికి మూడేళ్లలో రూ.28,632 రికవరీ, అప్‌గ్రేడ్స్ ఉంటే, గత రెండేళ్లలో ఇవి బాగా పెరిగాయి. గత రెండేళ్లలో రికవరీలు, అప్ గ్రేడ్స్ రూ.45,429గా ఉన్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమంటే బ్యాడ్ లోన్స్ ఓసారి మాఫీ చేశాక, వాటిని తిరిగి రికవరీ చేసుకోవడం అసాధ్యమే. లోన్స్ రుణమాపీ కంటే ముందు బ్యాంకు అందుకు సరైన నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

గత శుక్రవారం ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ 2019 ఆఱ్థిక సంవత్సరం బ్యాంకు ఫలితాలను ప్రకటించాడు. అకౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మాత్రమే మాఫీ చేశామని, అంతకుమించి ఏమీ లేదని చెప్పాడు. కాగా, గత అయిదేళ్లలో ఎస్బీఐ మాఫీ చేసిన అకౌంట్స్ నుంచి రూ.22,859 కోట్లు రికవరీ చేసింది. ఇందులో 2018, 2019 ఆర్థిక సంవత్సరాలలోనే రూ.13,678 కోట్లు వచ్చాయి. రుణమాఫీ చేసినప్పటికీ గత అయిదేళ్లలో వీటి రికవరీ పెరిగిందని చెబుతున్నారు. గత అయిదేళ్లలో రూ.1.6 ట్రిలియన్లు మాఫీ చేస్తే, రూ.96,920 వసూలయ్యాయి. ఇందులో మాఫీ చేసినవి కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications