రిలయన్స్ జియో తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎగ్సిస్టింగ్ కస్టమర్లకు ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంటే సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు పొడిగించింది. దీంతో జియో యూజర్లు ప్రైమ్ సభ్యత్వం కింద ఏడాది పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో క్లౌడ్ వంటి సేవలు ఉచితంగా పొందవచ్చు.

ప్రైమ్ మెంబర్‌షిప్ పొడిగింపు
జియో ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం ఖరీదు ఏడాదికి రూ.99. అయితే ఉచితంగానే పొడిగిస్తున్నట్లు జియో ప్రకటించింది. మైజియో యాప్‌లోకి వెళ్లి ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం ఆటో రెన్యూవల్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. మైజియో యాప్‌లోని మై ప్లాన్స్ సెక్షన్‌లో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ చూసుకోవచ్చు. పొడిగిస్తే ఆ మేరకు సందేశం వస్తుంది. ఇప్పటి వరకు జియో మెంబర్‌షిప్ ఏడాది మాత్రమే ఉండేది. తమ యూజర్ల కోసం ఇప్పుడు జియో ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా మరో ఏడాది వరకు ఫ్రీగా ఆటో రెన్యూవల్ అయ్యే అవకాశాన్ని కల్పించింది.

ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు
2016లో జియో కార్యకలాపాలు ప్రారంభించింది. ఆరు నెలల వరకు ఉచిత కాల్స్, డేటా సేవలు అందించింది. ఆ తర్వాత ఉచిత సేవలను ఆపేసి ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌ను తీసుకు వచ్చింది. అయితే ఇప్పటికే సభ్యత్వాన్ని రెండుసార్లు పొడిగించింది.

ఆటో రెన్యూవల్‌ను ఇలా చెక్ చేసుకోండి
మీ ప్రైమ్ మెంబర్‌షిప్ రెన్యూవల్ అయిందా లేదా తెలుసుకునేందుకు ఇలా చేయండి.
- మీ స్మార్ట్‌ఫోన్‌లోని MyJio యాప్‌ను ఓపెన్ చేయండి.
- మెనూ ఆప్షన్ లెఫ్ట్ లెఫ్ట్ కార్నర్‌ను ట్యాప్ చేయండి.
- My Plans సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ మీకు ప్లాన్స్ కనిపిస్తాయి. యాడ్ ఆన్ ప్యాక్స్ కూడా ఉంటాయి.
- Jio Prime Membership బార్ కూడా కనిపిస్తుంది.
- మీ జియో మెంబర్‌షిప్ రెన్యూవల్ అయి ఉంటే 'Your request to avail free JioPrime membership for a year has been registered successfully. You can now enjoy JioPrime benefits for another year. Thank You!' అని మెసేజ్ ఉంటుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications