For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

9 రోజుల నష్టాలకు బ్రేక్.. ఎట్టకేలకు లాభాల్లో స్టాక్ మార్కెట్ ముగింపు

By Chanakya
|

స్టాక్ మార్కెట్లో తొమ్మిది రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు షార్ట్ కవరింగ్ నేపధ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు కోలుకున్నాయి. నిఫ్టీ మళ్లీ 11,200 పాయింట్ల మార్కుపైనే ముగియడం కాస్త ఊరటనిచ్చే అంశం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిరుత్సాహ సంకేతాలు ఉన్నప్పటికీ.. మనపై ఆ ప్రభావం ఈ రోజు పెద్దగా కనిపించలేదు. ఇప్పటికే వరుస నష్టాలతో కుదేలవుతున్న మన సూచీలు ఈ రోజు తేరుకున్నాయి. అయితే ఒక దశలో 11, 108 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నిఫ్టీ ఏకంగా 11294 పాయింట్ల గరిష్ట స్థాయి వరకూ తేరుకుంది. అంటే ఏకంగా 186 పాయింట్లు కోలుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరకు 73 పాయింట్లు పెరిగి 11,222 పాయింట్ల దగ్గర నిఫ్టీ ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్టెల్, ఇండియాబుల్స్ వంటి స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను పైకి తీసుకెళ్లింది. సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 37,318 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 28,830 దగ్గర క్లోజైంది.

జియో దెబ్బకు 3 నెలల్లో వొడాఫోన్-ఐడియా నష్టం - రూ.4882 కోట్లుజియో దెబ్బకు 3 నెలల్లో వొడాఫోన్-ఐడియా నష్టం - రూ.4882 కోట్లు

ఇండియాబుల్స్ హౌసింగ్, భారతి ఎయిర్టెల్, సన్ ఫార్మా, వేదంతా, గెయిల్ టాప్ 5 గెయినర్స్‌ లిస్ట్‌లో నిలిచాయి. అయితే టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, హెచ్ సి ఎల్ టెక్ షేర్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి.

ఐటీ తప్ప

Markets Update: Sensex closes 228 points up, Nifty at 11,318

సెక్టోరల్ ఇండిసిస్‌లో భాగంగా ఒక్క ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లూ లాభాల బాట పట్టాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసిజి రంగ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.72 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.71 శాతం లాభపడ్డాయి.

సన్ రైజ్...

నిన్న కుప్పకూలిన సన్ ఫార్మా ఈ రోజు మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో లాభపడింది. సుమారు 7 శాతం వరకూ పెరిగిన స్టాక్ రూ.430 వరకూ చేరుకుంది. చివరకు రూ.420 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో గ్లెన్‌మార్క్ 2 శాతం, సిప్లా - పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, బయోకాన్ స్టాక్స్ 1 శాతానికి పైగా లాభపడ్డాయి. క్యాడిలా మాత్రమే 3 శాతం నష్టపోయింది.

డెల్టాకార్ప్ జోష్

జీఎస్టీ ఎగవేత ఆరోపణలతో నిన్న భారీగా పతనమైన మరో స్టాక్ డెల్టాకార్ప్. ఈ రోజు ఈ స్టాక్ కూడా 15 శాతం వరకూ పెరిగింది. ఇంట్రాడేలో సుమారు రూ.211 వరకూ వెళ్లింది. అయితే చివర్లో ప్రాఫిట్ బుకింగ్ రావడంతో స్టాక్ రూ.201 దగ్గర ముగిసింది.

జెట్‌కు మళ్లీ రెక్కలు కట్..

జెట్ ఎయిర్‌కు చీఫ్ ఫైనాన్షియల్‌ ఆఫీసర్ రాజీనామా, ఏతిహాద్ ఎయిర్‌వేస్ బిడ్ పై ఇంకా రాని స్పష్టత, జెట్‌కు కేటాయించిన స్లాట్స్ ఇతరులకు ఇచ్చివేయడం వంటి వివిధ కారణాలతో ఈ స్టాక్ మళ్లీ పతనమైంది. దీంతో ఇంట్రాడేలో రూ.121వరకూ చేరిన స్టాక్ చివర్లో కాస్త రికవరో రూ.129 దగ్గర ముగిసింది.( 7.5 శాతం నష్టంతో)

సెయిల్, ఐడియా నీరసం

మెటల్ ప్యాక్ నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఈ రోజు సెయిల్ 6.3 శాతం కోల్పోయింది. ఇక మిగిలిన లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఐడియా3 శాతం, న్యూ ఇండియా అస్యూరెన్స్ 3.5 శాతం నష్టపోయాయి.
మిడ్ క్యాప్ స్పేస్‌లో సింఫనీ 5.5 శాతం, ఎడిల్వైజ్ ఫైనాన్స్ 5 శాతం, ఒబెరాయ్ రియాల్టీ 4.5 శాతం, గ్రాఫైట్ ఇండియా 4 శాతం, బాటా ఇండియా 4 శాతం కోల్పోయాయి.

ఒకటికి 40 లాస్

ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిన స్టాక్స్‌లో ఈ రోజు 52 వారాల గరిష్ట - కనిష్ట స్టాక్స్‌ కాలమ్ చూస్తే ఏ స్థాయిలో వీక్‌నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 52 వారాల గరిష్టాన్ని తాకిన స్టాక్స్ కేవలం 7 మాత్రమే ఉన్నాయి. అందులో అతుల్, డిసిబి బ్యాంక్, మెర్క్, ఎస్ఎఆర్ఎఫ్ మాత్రమే ప్రస్తావించాల్సిన పేర్లు. ఇక కనిష్టాన్ని తాకిన స్టాక్స్‌ లిస్ట్ ఏకంగా 285వరకూ ఉంది.

English summary

9 రోజుల నష్టాలకు బ్రేక్.. ఎట్టకేలకు లాభాల్లో స్టాక్ మార్కెట్ ముగింపు | Markets Update: Sensex closes 228 points up, Nifty at 11,318

Sensex closed 228 points or 0.61 per cent up at 37,318 with 17 components in the green, Nifty ended 73 points or 0.66 per cent up at 11,318.53.
Story first published: Tuesday, May 14, 2019, 16:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X