హౌసింగ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్.. ఇలా దేనికైనా ఇప్పుడు మొదటగా చూసేది సిబిల్ స్కోర్. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇచ్చే ఈ స్కోర్ ఆర్థిక సంస్థలకు వేదవాక్కు. మన స్కోర్ ఎంత తక్కువ ఉంటే.. రుణాలు పొందడం అంత ఇబ్బంది అనే సంగతి మనలో చాలామందికి తెలుసు. అదే 750 నుంచి 900 వరకూ మన స్కోర్ పెరిగితే.. ఇక మనకు తిరుగుండదు. ఎలాంటి లోన్ కావాలన్నా.. అందరి కంటే తక్కువ వడ్డీ రుణం దొరుకుతుంది. అయితే అందుకోసం ఏం చేయాలి.. ఇవి ఫాలో అయిపోవడమే. ప్రస్తుతం మన దేశంలో 300-900 మధ్య సిబిల్ స్కోర్ లెక్కిస్తున్నారు. 750కిపైన ఉంటే.. మంచి స్కోర్ ఉన్నట్టే లెక్క. దాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఎలా పెంచుకోవాలో చూద్దాం.

క్రెడిట్ కార్డ్ అప్పును మొత్తం తీర్చేయండి
కష్టకాలంలోనో, లేక ఆర్థికంగా తాత్కాలిక అవసరాలకు మాత్రమే మనకు క్రెడిట్ కార్డ్ కావాలి. అవసరం తీరి డబ్బు చేతికందగానే మనం వీటిని తీర్చేయాలి. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. బ్యాంక్ ఇచ్చిన క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో 30 శాతానికి మించి వాడడం మాత్రం సరైంది కాదు. ఇది ఎంత ఎక్కువ పెరిగితే.. మనకు అంత స్కోర్ తగ్గిపోతుంది అని అర్థం. ఉదా. లక్ష లిమిట్ ఉంటే రూ.30 వేలకు మించి మనం ఖర్చు చేయకపోవడం మంచిది. అయితే చాలా మంది దీన్ని పట్టించుకోరు. ఫుల్‌గా వాడేసి రెగ్యులర్‌గా కడ్తూ ఉన్నా సరే.. మన స్కోర్‌పై మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది. దీనికి వాళ్లు ఇచ్చే వెయిటేజ్ 30 శాతం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకో ముఖ్య అంశం.. ఔట్ స్టాండింగ్ ఎక్కువగా ఉంచుకోకపోవడం. కేవలం మినిమం అమౌంట్ మాత్రమే చెల్లిస్తూ.. క్రెడిట్‌ను రివాల్వ్ చేస్తూ పోతే.. స్కోర్ నానాటికీ తీసికట్టుగా తయారవుతుంది. అందుకే సాధ్యమైనంత తక్కువ వాడి.. ఆన్ టైంలో పేమెంట్ చేస్తే మీరు మొదటి విజయం సాధించినట్టే లెక్క.

అవసరమా.. విలాసమా
మార్కెటింగ్ సంస్థలు, ఈ -కామర్స్ సైట్స్.. మిమ్మల్ని ఇక్కడే పూర్తిస్థాయిలో టెంప్ట్ చేసి ఇరికించేస్తూ ఉంటాయి. సేల్స్ పేర్లు పెట్టి.. క్రెడిట్ కార్డుల మీద 5-10 శాతం డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. వీటికి ఎట్రాక్ట్ అయి మనం కొనుక్కుంటూ పోతాం. తీరా నెలాఖరులో బిల్లు చెల్లించాల్సి వచ్చే సరికి తెల్లమొహం వేస్తాం. అందుకే మనం అప్పుపై కొనబోయే వస్తువు అవసరమా.. లేక విలాసమా ఆలోచించుకుని కొనండి. స్థాయికి మించి ఐ ఫోన్, పిక్సెల్ కొనాలని అందరికీ ఉంటుంది.. కానీ దాన్ని ఈఎంఐపై కొన్నా నెలనెలా ఆ అనవసరపు భారాన్ని మోయడం నిజంగా ఉపయోగమా ఆలోచించండి. డబ్బు పోగేసి.. అప్పుడు కొంటే.. ఆ కిక్ వేరు కానీ.. అప్పుపై కొని ఇతరుల కోసం ఇరుక్కోవడం కరెక్ట్ కాదనే సంగతి గుర్తుంచుకోండి.

స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ సంగతి చూడండి
మనం చదివే మ్యాగ్జైన్ లేదా మూవీ ఆఫర్స్ రెన్యువల్.. లేదా జిమ్ మెంబర్షిప్ లేదా క్లబ్ రెన్యువల్.. వంటివి నెలకో, ఆరు నెలలకో, ఏడాదికో ఓ సారి వచ్చే ఖర్చులు. వీటిని ఆటో రెన్యువల్ పెట్టేస్తే.. మన ప్రమేయం లేకుండానే ఇవి కార్డ్ నుంచి డిడక్ట్ అయిపోతాయి. మనం వాటిని వాడుతున్నామా లేదా.. అవి మనకు ఉపయోగం ఉన్నాయా లేవా అని ఆలోచించుకుని అప్పుడు ఆటో రెన్యువల్ పెట్టుకోండి. లేకపోతే.. వాటిని ఒకసారి సమీక్షించి ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకోండి.

ఇవి ఆటో పేమంట్స్ పెట్టుకోండి
ఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇంటర్నెట్ వంటి అవసరాలకు మీరు ఆటో పేమెంట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీటిని డిఫాల్ట్ అయినా సరే కొన్ని సంస్థలు సిబిల్‌కు సమాచారాన్ని తెలుపుతున్నాయి. అందుకే ఇలాంటి వాటిని ఆటో రీపేమెంట్ ఆప్షన్ పెట్టుకోండి. మరో ముఖ్య అంశం.. మీ బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ కార్డ్ లింక్. క్రెడిట్ కార్డ్ ఆఖరి తేదీ రోజున మీ బ్యాంక్ ఖాతా నుంచి పూర్తిగా డబ్బులు చెల్లించి వేసే ఆటోమేషన్ పద్ధతిని పెట్టుకోండి. ఒక వేళ మీకు వివిధ కార్డులు ఉండి వాటిని గుర్తుపెట్టుకోవడం కష్టమైనప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకోవడం బెటర్. దీని వల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండకపోవడంతో పాటు లేట్ పేమెంట్ ఫీజులు, పెనాల్టీ, ఇంట్రెస్ట్ రేట్స్ వంటివి చెల్లించాల్సిన బాధ ఉండదు.

ఎప్పటికప్పుడు స్కోర్ తెలుసుకోండి
చాలా మంది దీన్ని అసలు పట్టించుకోరు. ఎప్పటికప్పుడు మన క్రెడిట్ స్కోర్ ఎంతుందో తెలుసుకోవడం ముఖ్యం. అందుకే క్రెడిట్ మానిటరింగ్ సేవలను పొందండి. ఎందుకంటే.. మనకు తెలియకుండా ఎవరైనా కార్డు వాడినా.. లేక మన ప్రమేయం లేకుండా స్కోర్ తగ్గిపోయినా.. మన ప్రొపైల్‌లో తప్పులు వచ్చినా వాటిని సరిదిద్దుకునే అవకాశం మనకు దక్కుతుంది. కొన్ని సంస్థలు ఉచితంగా ఈ సేవలను అందిస్తూ ఉంటే.. సిబిల్ వంటివి రూ.600-700 వరకూ ఫీజును వసూలు చేసి పక్కా రిపోర్ట్ ఇస్తోంది. దీన్ని కనీసం ఏడాదికి రెండు సార్లైనా చూసుకుని మన ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో అర్థం చేసుకోండి.
సో.. పైన మీరు చదవిన 5 పాయింట్లను తప్పకుండా ఫాలో అయితే.. మీ స్కోర్ 750కి పైగానే పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను పెంచి, మంచి కస్టమర్ అని ముద్రవేస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications