For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆశ్చర్యంగా ఓ పెరుగు కంపెనీలో దీపికా పదుకొణే పెట్టుబడి

By Chankaya
|

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మళ్లీ ఇన్వెస్టర్ అవతారమెత్తారు. డ్రమ్ ఫుడ్స్ అనే సంస్థ స్థాపించిన ఎపిగామియాకు బ్రాండ్ ఎంబాసిడర్‌గా మారడంతో పాటు వ్యూహాత్మక భాగస్వామిగా కూడా పెట్టుబడులు పెట్టబోతున్నారు.

ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయాలి, ఏది లాభదాయకం?ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయాలి, ఏది లాభదాయకం?

రకరకాల రుచుల్లో పెరుగు

రకరకాల రుచుల్లో పెరుగు

ఎపిగామియా అనే యోగర్ట్ సంస్థ.. పెరుగులో విభిన్న రకాల రుచులను అందిస్తూ జనాలను ఆకట్టుకుంటోంది. తక్కువ షుగర్‌తో ఎక్కువ ప్రోటీన్‌ అందే విధంగా ఎపిగామియా తన ప్రోడక్టులను డిజైన్ చేసింది. పెరుగుకు బ్లూబెర్రీ, అల్ఫాన్సో మ్యాంగో, స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి ఫ్లేవర్లను జోడిస్తూ యోగర్ట్‌ను అందిస్తోంది. దీంతో పాటు స్నాక్ ప్యాక్‌ను కూడా రూపొందిస్తూ.. డైట్ లవర్స్‌కు ఫేవరెట్‌గా మారింది. 90 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకూ వివిధ ప్యాక్‌ల్లో ఈ ఫుడ్ లభిస్తోంది. ఈ ఎఫ్ఎంసిజి బ్రాండ్ ఇప్పుడు మరింత పాపులారిటీ సంపాదించబోతోంది. డ్రమ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ ఎపిగామియాను నిర్వహిస్తోంది.

తాజాగా బెల్జియం దేశానికి చెందిన డనోన్ మ్యానిఫెస్టో వెంచర్స్, డీఎస్‌జీ కన్స్యూమర్ పార్ట్‌నర్స్ అనే సంస్థలు సిరీస్ సి ఫండింగ్ కూడా అందించారు. డనోన్ ఫుడ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది.

దీపిక పెట్టుబడి ఎంత

దీపిక పెట్టుబడి ఎంత

సాధారణంగా తన బ్రాండ్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తపడే దీపికా పదుకొనే తన యాటిట్యూట్‌కు తగ్గట్టే సదరు బ్రాండ్స్ ఉండేలా చూసుకుంటుంది. తాజాగా బ్రాండ్ ఎంబాసిడరింగ్‌లోనూ అదే జాగ్రత్త తీసుకుంది. ఎందుకంటే ఇది ఫిట్‌నెస్‌తో పాటు ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వారికి అత్యంత ఫేవరెట్ బ్రాండ్. దీపిక కూడా ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రయార్టీ ఇస్తారు కాబట్టి.. దీనిపై ఆసక్తి చూపారు. అందుకే పెట్టుబడులు కూడా పెట్టారు. అయితే ఆమె డ్రమ్ ఫుడ్స్‌లో ఎంత వాటా కొన్నారు, ఎంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. సిరీస్ సి ఫండింగ్‌తో పాటు దీపికా పదుకోన్ పెట్టుబడుల నేపధ్యంలో మరిన్ని నగరాలకు తమ ప్రోడక్టులను విస్తరిస్తామని సంస్థ యాజమాన్యం చెబ్తోంది.

2015లో మొదలైన ఎపిగామియాకు ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో 20 స్టాక్ కీపింగ్ యూనిట్స్ (ఎస్.కె.యు) ఉన్నాయి. ఈ కంపెనీ పేరెంట్ సంస్థ డ్రమ్ ఫుడ్స్‌ను 2008లో వార్టన్ బిజనెస్ స్కూల్ అలుమ్ని అయిన రోహన్ మీర్‌చందానీ, చెఫ్ గణేష్ క్రిష్ణమూర్తి, రాహుల్ జైన్, ఉదయ్ టక్కర్ కలిసి ప్రారంభించారు. ప్రస్తుతం 10 వేలకు పైగా రిటైల్ స్టోర్లలో ఈ ప్రోడక్ట్స్ అమ్ముడవుతున్నాయి. వీటితో పాటు బిగ్ బాస్కెట్, అమెజాన్ వంటి సైట్లు కూడా వీటిని అందిస్తున్నాయి. రాబోయే రెండేళ్లోల 50 వేల ఔట్‌లెట్స్‌కు 25 నగరాలకు విస్తరించడమే తమ లక్ష్యమంటోంది డ్రమ్ ఫుడ్స్.

దీపిక బ్రాండ్స్ తక్కువేం కాదు

దీపిక బ్రాండ్స్ తక్కువేం కాదు

హాలీవుడ్ నటుల స్థాయిలో సంపాదించే దీపికా పదుకొనే డజనుకు పైగా టాప్ బ్రాండ్స్‌ను ఎండార్స్ చేస్తోంది. కోకో కోలా, యాక్సిస్ బ్యాంక్, విస్తారా ఎయిర్, కెల్లాగ్స్, వోగ్, టిస్సాట్, వాన్‌హూసెన్, తనిష్క్, నైకీ వంటి బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి. వీటికి తోడు 'ఆల్ అబౌట్ యు' అనే సొంత లేబుల్‌తో ఫ్యాషన్ ప్రోడక్ట్స్‌ను మింత్రా సైట్‌ ద్వారా విక్రయిస్తున్నారు. ఫుర్లెన్సో అనే ఆన్ లైన్ ఫర్నిచర్ సంస్థలో, పర్‌పుల్‌ అనే బ్యూటీ ప్రోడక్ట్స్ ఆన్ లైన్ విక్రయ సంస్థలోనూ ఆమె పెట్టుబడులు పెట్టారు.

Read more about: invest
English summary

ఆశ్చర్యంగా ఓ పెరుగు కంపెనీలో దీపికా పదుకొణే పెట్టుబడి | Deepika Padukone invests in maker of Epigamia yogurt

Drums Food International, the parent company of fresh FMCG brand Epigamia, Monday announced a multi-crore strategic partnership with Deepika Padukone, which includes an investment from the Bollywood actress. The actor will also endorse the brand as its brand ambassador and act as a strategic advisor to the FMCG brand.
Story first published: Tuesday, May 14, 2019, 15:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X