సౌదీ అరేబియాకు కలిసొచ్చిన కాలం.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావం..
ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలు సౌదీ అరేబియాకు కలిసి రానుంది. ఇంతకాలం ఇరాన్ నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసిన దేశాలు ఇప్పుడు సౌదీ వైపు చూస్తున్నాయి. జూన్ నుంచి పెరగనున్న డిమాండ్ నేపథ్యంలో సౌదీ అరేబియా సైతం ఉత్పత్తిని పెంచింది. అటు గల్ఫ్ అరబ్ దేశాలైన ఇరాక్, కువైట్, యూఎఈలు సైతం ఉత్పత్తి సామర్థ్యం పెంచాయి.

ఒపెక్ ఒప్పందం మేరకు
ఒపెక్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా రోజుకు 10.3 మిలియన్ బ్యారెళ్ల చమురు వెలికితీసే అవకాశముంది. అయితే డిమాండ్ లేని కారణంగా సౌదీ ఆ టార్గెట్ రీచ్ కాలేకపోతోంది. ఈ కారణంగానే ఏప్రిల్‌లో పరిమితి కన్నా 5లక్షల బ్యారెళ్ల తక్కువ ఆయిల్‌ను వెలికితీసింది. ఇరాన్‌పై యూఎస్ ఆంక్షల నేపథ్యంలో సౌదీ అరేబియా ఒపెక్ దేశాల ఒప్పందాన్ని ఉల్లంఘించకుండానే ఉత్పత్తిని పెంచి సొమ్ము చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే మిగతా అరబ్ దేశాల పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికే అవి పూర్తిస్థాయిలో క్రూడాయిల్ ఉత్పత్తి చేస్తున్నందున ప్రొడక్షన్‌ను మరింత పెంచే అవకాశం లేకుండాపోయింది.

మార్కెట్‌పై పెను ప్రభావం
ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో చమురు మార్కెట్‌పై పెను ప్రభావం పడనుంది. ఇరాన్ నిత్యం 8లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ ఉత్పత్తి చేస్తుంది. ఇంత భారీస్థాయి కొరతను సౌదీ, యూఏఈతో కలిసి పూడ్చుతామనని అమెరికా హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికాలో ఉత్పత్తయ్యే క్రూడాయిల్ అక్కడి వినియోగానికే సరిపోతుంది. దీంతో ప్రపంచ దేశాలు సౌదీ, యూఏఈల ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది.

భారత్‌పై ఆంక్షల ప్రభావం
మే 1 నుంచి ఇరాన్ నుంచి భారత్ సహా 8దేశాలకు క్రూడాయిల్ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో చైనా, టర్కీలను తప్పించి ఇరాన్ నుంచి ఆయా దేశాలు చమురు కొనుగోళ్లను నిలిపివేశాయి. ఆంక్షల నేపథ్యంలో మిగతా దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాయి. ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారత్‌పై దీని ప్రభావం ఎక్కువగా పడింది. ఈ ఎఫెక్ట్‌తో పెట్రో ధరలు మరింత పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లుపడనుంది.


Click it and Unblock the Notifications