For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

@70.54: 11 వారాల కనిష్టానికి పడిపోయిన రూపాయి, 33,000 వేల మార్క్ దాటిన బంగారం

|

డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం మరింత పడిపోయింది. 63 పైసలు తగ్గి 70.54 కు పడిపోయింది. అంతకుముందు డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.91గా ముగిసింది. ఈ రోజు 70 మార్క్ దాటింది. 11 వారాలకు పడిపోయింది. ఉదయం 70.12 పైసల వద్ద ప్రారంభమైన రూపాయి మారకం విలువ చివరకు 70.54 పైసల వద్ద ముగిసింది. ఈ ఏడాది రూపాయి విలువ 0.3 శాతం పడిపోయిది.

బంగారం ధరలు కూడా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ రూ.65 పెరిగింది. దీంతో పది గ్రాముల 99.9 శాతం ప్యూరిటీ బంగారం ధర రూ.33,018, 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ ధర 32,848 గా ఉంది. అదే సమయంలో వెండి రూ.175 తగ్గింది. కిలో రూ.38,000 గా ఉంది.

Rupee closes at 11 week low against US dollar, Gold prices rise

ఇదిలా ఉండగా, మార్కెట్లో డెల్టా కార్ప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో దాదాపు పదమూడు శాతం కుంగి రూ.186 వద్దకు ఉన్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పుడు భారీ వాల్యూమ్‌లతో విక్రయాలు జరిగాయి. దీంతో 2017 సెప్టెంబర్ 25 తర్వాత ఇంత స్థాయిలో షేర్ల ధరలు పతనం కావడం ఇదే మొదటిసారి.

'ఇన్ఫోసిస్'కు కేంద్ర హోంశాఖ షాక్!: ఫౌండేషన్ రిజిస్ట్రేషన్'ఇన్ఫోసిస్'కు కేంద్ర హోంశాఖ షాక్!: ఫౌండేషన్ రిజిస్ట్రేషన్

ఇప్పటికే గత రెండు ట్రేడింగ్ సెషన్లలో 19 శాతం షేరు ధరలు కుంగాయి. రూ.6,189 కోట్ల మేరకు జీఎస్టీ ఎగవేత కేసులో డీజీ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ కేసులు నమోదు చేయడంతో షేరు ధర పతనమవుతోంది. దీనికి తోడు గోవా ప్రభుత్వం కెసినో లైసెన్స్‌లను పునః పరిశీలిస్తానని పేర్కొంది. దీంతో షేర్ల విక్రయాలు జరుగుతున్నాయి. డెల్టా కార్ప్ ప్రధానంగా కెసినో గేమింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం వచ్చిన జీఎస్టీ ఆరోపణలపై డెల్టా కార్ప్ సీఈవో మాట్లాడుతూ... తాము జీఎస్టీ నిబంధనలు పాటిస్తున్నామన్నారు.

English summary

@70.54: 11 వారాల కనిష్టానికి పడిపోయిన రూపాయి, 33,000 వేల మార్క్ దాటిన బంగారం | Rupee closes at 11 week low against US dollar, Gold prices rise

e Indian rupee on Monday closed at a near 11 week low against the US dollar, tracking a fall in domestic equity markets and subdued Asian currencies.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X