For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొమ్మిదో రోజూ తప్పని పతనం, స్టాక్ మార్కెట్ కకావికలం

By Chanakya
|

స్టాక్ మార్కెట్‌లో తొమ్మిదో రోజూ పతనం ఇన్వెస్టర్లకు ముచ్చెమటలు పట్టించింది. అనూహ్యంగా ఆఖరి గంటలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ను కకావికలం చేసింది. స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఇలా తొమ్మిదో రోజు కూడా పతనం కావడం ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే చూస్తున్నాం. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కేవలం 400 స్టాక్స్ లాభపడితే.. 1800 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. దీన్ని బట్టి ఏ స్థాయిలో పతనం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ ఎవరూ ఊహించనంత స్థాయిలో పతనమై టెన్షన్ పెట్టాయి. మొత్తానికి వారం ప్రారంభంలోనే వచ్చిన ఈ స్థాయి సెల్లింగ్ ప్రెషర్‌ను చూస్తే.. రాబోయే ఎన్నికల ఫలితాలను మార్కెట్ ముందే ఊహించినట్టు కనిపిస్తోంది. చివరకు సెన్సెక్స్ 372 పాయింట్ల నష్టంతో 37,090 దగ్గర ముగిసింది. నిఫ్టీ 131 పాయింట్లు కోల్పోయి 11,148 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 380 పాయింట్ల నష్టంతో 28,660 దగ్గర నిలిచింది.

భారతి ఎయిర్టెల్, టైటన్, టెక్ మహీంద్రా, హెచ్ డి ఎఫ్ సి, హిందుస్తాన్ యునిలివర్ టాప్ ఫైవ్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, జీ ఎంటర్‌టైన్మెంట్, ఇండియాబుల్స్ హౌసింగ్, యెస్ బ్యాంక్ స్టాక్స్ లూజర్స్‌గా నిలిచాయి.

Market falls for 9th straight session, suffers worst losing streak in 8 yrs

మిడ్, స్మాల్ ఇండెక్స్‌లు కూడా రెండు శాతానికి పైగా పతనం కావడం ప్రధానంగా గమనించాల్సిన అంశం. ఇక సెక్టోరల్ ఇండెక్స్‌ల పరంగా చూస్తే.. ఒక్క ఐటి మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో సెల్లింగ్ ప్రెషర్ తీవ్రంగా ఉంది. పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, మీడియా, ప్రైవేట్ బ్యాంక్స్, రియాల్టీ, మెటల్, ఎఫ్ఎంసిజి రంగాల్లో సెల్లింగ్ ప్రెషర్ అత్యధికంగా ఉంది.

సన్ స్ట్రోక్

సన్ ఫార్మా ఒక్కసారిగా కుప్పకూలింది. స్పష్టమైన కారణమేదీ తెలియనప్పటికీ ఈ స్టాక్ ఈ రోజు 20 శాతం పడిపోయింది. ఇంట్రాడేలో రూ.344 కనిష్ట స్థాయికి పతనమైన స్టాక్ మళ్లీ నిమిషాల్లోనే 15 శాతం వరకూ కోలుకుంది. చివరకు 5.5 శాతం నష్టంతో రూ.414 దగ్గర ముగిసింది. ఇదే సంస్థకు చెందిన మరో స్టాక్ 6.5 శాతం నష్టంతో రూ.146 దగ్గర క్లోజైంది.
ఇదే రంగానికి చెందిన క్యాడిలా 6.7 శాతం, అరబిందో ఫార్మా 4 శాతం, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ 4 శాతం, లుపిన్ - గ్లెన్‌మార్క్ - బయోకాన్ 3 శాతం వరకూ కోల్పోయాయి. ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తోందేమో అనే సంకేతంతో ముందే మార్కెట్లో సెల్లింగ్ వచ్చినట్టు ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
కానీ ఫార్మా చెందిన మెర్క్ మాత్రం 5.5 శాతం లాభంతో రూ.3911.65 దగ్గర క్లోజైంది.

ఐషర్ బుల్లెట్‌కు బ్రేక్

ఫలితాలు, అమ్మకాలకు తోడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో విస్తరణకు సంస్థ మొగ్గుచూపడం మార్కెట్ వర్గాలకు రుచించలేదు. వీటికి అదనంగా సీఎల్ఎస్ఏ కూడా తన టార్గెట్లను తగ్గించింది. దీంతో ఈ స్టాక్ ఏకంగా 7.7 శాతం నష్టంతో రూ.18766 దగ్గర క్లోజైంది.
ఇదే ఆటో రంగానికి చెందిన స్టాక్స్‌లో మదర్సన్‌సుమీ 4.5 శాతం, అశోక్ లేల్యాండ్ 3.5 శాతం, టాటా మోటార్స్ 3 శాతం కోల్పోయాయి.

జీ ఎంటర్‌టైన్మెంట్ మళ్ళీ డౌన్ ట్రెండ్

కొద్దిగా కోలుకుంటోంది అని అనుకుంటున్న తరుణంలో జీ ఎంటర్‌టైన్మెంట్ మళ్లీ దిగాలు పడింది. జీలో వాటాల అమ్మకానికి సంబంధించి ఎలాంటి ఆందోళనా అక్కర్లేదని, ప్రాసెస్ కొనసాగుతోందనే అంశాన్ని సంస్థ యజమాన్యం స్పష్టం చేసినప్పటికీ ఈ స్టాక్ ఏ స్థాయిలోనూ నిలదొక్కుకోలేదు. చివరకు 8 శాతం కోల్పోయి రూ.342 దగ్గర ముగిసింది.

మిడ్ క్యాప్ మంటలు

ఒక్కో స్టాక్ ఒక్కో కారణంతో పడింది. ఇంకొన్ని న్యూస్‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా కుప్పకూలాయి. జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకల వార్తలతో డెల్టా కార్ప్ ఏకంగా 13 శాతం (రూ.186.50) కోల్పోయింది. డిష్ టీవీ 10 శాతం, డీసీఎం శ్రీరాం 9.5 శాతం నష్టపోయాయి. ఇదే బాటలో జీఎంఆర్ ఇన్ఫ్రా, టీవీ18 బ్రాడ్‌కాస్ట్, ఇంజనీర్స్ ఇండియా, రిలాక్సో, గ్రాఫైట్ ఇండియా వంటి స్టాక్స్ 5 శాతం వరకూ పతనమయ్యాయి.
స్మాల్ క్యాప్ స్పేస్‌లో ఐఆర్‌బి ఇన్ఫ్రా 13 శాతం, క్విక్ హీల్ 12 శాతం, స్ట్రైట్స్ సాషున్ 10 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 9 శాతం, జెట్ ఎయిర్ 8 శాతం, ఇండియా సిమెంట్స్ 7.5 శాతం, రెయిన్ ఇండస్ట్రీస్ 7 శాతం, ఐబి రియల్ 7 శాతం, వెంకీస్ 6.5 శాతం నష్టపోయింది.

హెచ్ డి ఎఫ్ సి పెరిగింది

మెరుగైన త్రైమాసిక ఫలితాల నేపధ్యంలో హెచ్ డి ఎఫ్ సి స్టాక్ ఇంతటి నష్టాల మార్కెట్లోనూ లాభాల్లోకి చేరింది. 1.06 శాతం లాభంతో రూ.1952 దగ్గర క్లోజైంది.

గెయినర్స్ లిస్ట్‌లో ఐడియా 3.2 శాతం, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ 2.2 శాతం, భారతి ఇన్ఫ్రాటెల్ 2 శాతం ఉన్నాయి. ఎడిల్వైజ్ ఫైనాన్స్ 3.5 శాతం, మోతిలాల్ ఒస్వాల్ 3.2 శాతం, సెరా శానిటరీ 4 శాతం పెరిగాయి.

English summary

తొమ్మిదో రోజూ తప్పని పతనం, స్టాక్ మార్కెట్ కకావికలం | Market falls for 9th straight session, suffers worst losing streak in 8 yrs

A last hour sell off prompted the benchmark indices to end lower for the 10th consecutive session that also marked the markets' longest losing streak in over eight years.
Story first published: Monday, May 13, 2019, 17:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X