న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు హోమ్ మంత్రిత్వ శాఖ షాకిచ్చింది. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఈ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను హోమ్ మినిస్ట్రీ శాఖ రద్దు చేసింది. విదేశీ నిధుల స్వీకరణలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. విదేశీ ఫండ్స్ రావాలంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో)లు తప్పనిసరిగా ఫారన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (FCRA) కలిగి ఉండాలి. ఇప్పుడు దీనిని హోంశాఖ రద్దు చేసింది.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఈ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. కానీ FCRA నిబంధనల ప్రకారం రిజిస్టర్ అయిన స్వచ్చంధ సంస్థలు తమ వార్షిక ఆదాయాన్ని, విదేశీ నిధుల వ్యయాలను, బ్యాలెన్స్ షీట్ వివరాలు సమర్పించాలి. విదేశాల నుంచి విరాళాలు రాకపోతే నిల్ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది.

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ గత ఆరేళ్లుగా తమ ఆదాయ, వ్యయాలను వెల్లడించడం లేదు. దీంతో నోటీసులు జారీ అయ్యాయి. గత ఏడాది షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆరేళ్లుగా ఆదాయ వ్యయాలు సమర్పించనందుకు పోయిన సంవత్సరం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్పందించకపోయేసరికి ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కూడా ధ్రువీకరించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను 1996లో స్థాపించారు. సుధామూర్తి దీనికి ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. కాగా, కేంద్ర హోంశాఖ గత ఏడాది దాదాపు 1755 ఎన్జీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందులో పలు కంపెనీలు కూడా ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications