లాకర్. కాస్తో.. కూస్తో డబ్బున్న వాళ్లకు భద్రపరుచుకునే సాధనం. గ్రామీణ బ్యాంకుల దగ్గర నుంచి కోఆపరేటివ్, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ ఈ సేవలను తమ కస్టమర్లకు అందిస్తూ ఉంటాయి. అయితే తాజాగా.. ఓ వాస్తవం వెలుగులోకి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు, ఐటీ శాఖ వరుస దాడుల నేపధ్యంలో ప్రైవేట్ లాకర్ల బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయ్యే స్థితికి వచ్చింది. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో లాకర్ల బిజినెస్‌కు లాక్ పడే స్థితి వచ్చిందని ఓ అధ్యయనంలో తేలింది.

కారణం ఏంటంటే..
ఈ మధ్యకాలంలో ఐటీ శాఖ వేగం పెంచింది. ఎక్కడెక్కడి నుంచో సేకరించిన సమాచారంతో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు అనే తేడా లేకుండా విస్తృత దాడులు చేస్తోంది. దీంతో లాకర్లలో డబ్బు, జ్యువెల్రీ పెట్టాలంటేనే జనాలు జంకుతున్నారు. ఇప్పటికే ప్రధాన బ్యాంకుల్లో కూడా వీటికి కొద్దిగా గిరాకీ తగ్గింది. ఇక ప్రైవేట్ లాకర్లను నిర్వాహించే వాళ్ల స్థితి మరీ దారుణంగా తయారైందట. ఈ మధ్య కోల్‌కతాలోని వర్‌దాన్ మార్కెట్లో ప్రైవేట్ లాకర్ల సంస్థపై ఐటీ శాఖ దాడులు చేసింది. అక్కడ సుమారు 600 లాకర్ల వరకూ ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి నుంచి కోట్ల రూపాయల నల్ల డబ్బు, పెద్ద ఎత్తున జ్యువెల్రీని ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొద్దికాలం క్రితం ఢిల్లోలని చాందినీ చౌక్‌లో కూడా ఈ తరహా దాడుల నుంచి ఐటీ శాఖ రూ.25 కోట్ల నగదును బయటకు తీసింది. ఆశ్చర్యం ఏంటంటే.. సదరు డబ్బు ఎవరిది అనే అంశాన్ని వాళ్లు ధృవీకరించుకోలేకపోయారు. ఎందుకంటే.. సరైన కెవైసీ నిబంధనలను పాటించకుండా ప్రైవేట్ లాకర్ల యజమానులు వాటిని రెంట్‌కు ఇచ్చారు.

రూల్స్ లేకుండా.. ఇష్టారాజ్యం.. కానీ భద్రత పటిష్టం
సాధారణంగా ఓ బ్యాంక్ నుంచి లాకర్ పొందాలంటే చాలా కష్టం. ముందుగా అందులో ఖాతా ఉండాలి, ఆ తర్వాత అక్కడ ఖాళీ ఉండాలి. కానీ ప్రైవేట్ లాకర్లను ఆర్గనైజ్ చేసే వాళ్లు అలాంటివేం పెద్దగా పట్టించుకోరు. లాకర్‌లో ఏం పెడ్తున్నారు, ఎంత పెడ్తున్నారు.. వంటి డీటైల్స్ కూడా వాళ్లకు అనవసరం. వందల సంఖ్యలో సేఫ్ లాకర్లను ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఈ లాకర్స్ సాధారణంగా కోల్‌కతా, ముంబై, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు గుజరాత్‌లో అత్యధికంగా ఉంటాయి. వాస్తవానికి వీటికి ఆర్బీఐ వంటి చట్టబద్ధ సంస్థల నుంచి పెద్దగా అనుమతులు కూడా ఉండవు. చాలా వాటికి బీమా సౌకర్యం కూడా ఉండదని తెలుస్తోంది. కానీ.. పెద్ద వ్యాపారులు, నల్లడబ్బును దాచుకునే వాళ్లు మాత్రం వీటిని స్వర్గధామంగా భావిస్తారు. ఎందుకంటే వీటికి సెక్యూరిటీ పాయింట్‌లో చాలా పటిష్టంగా నిర్వహిస్తారు. 24 గంటల పాటు టైట్ సెక్యూరిటీ, వైబ్రేషన్ సెన్సార్స్, హ్యూమన్ సెన్సార్స్, పటిష్ట సెక్యూరిటీ అలార్మ్ వ్యవస్థలు ఉంటాయి. కానీ బ్యాంకుల్లో లాకర్లు బ్రేక్ చేసిన ఘటనలు మనం చాలానే చూశాం. ఇక్కడ మాత్రం అలాంటివి జరగకుండా జాగ్రత్తపడ్తారు.

లాకర్ రేటూ ఎక్కువే
సాధారణంగా బ్యాంకుల్లో లాకర్ పొందడం కష్టమైన వ్యవహారం. మేనేజర్ తెలిసి ఉండాలి, లేకపోతే పెద్ద ఎత్తున డిపాజిట్ చేయాలి, మరీ కాదనుకుంటే వాళ్లు ఇచ్చే ఇన్సూరెన్స్ స్కీములో మరొకటో ఇన్వెస్ట్ చేయాలి. అలా చేసినా సైజ్‌ను బట్టి రూ.2-3 వేల నుంచి రూ.15-20 వేల వరకూ వసూలు చేస్తారు. కానీ ప్రైవేట్ ఏజెన్సీల ప్రారంభ ధరే రూ.5 వేలు ఉంటుంది. ఇది అవసరం, సైజ్‌ను బట్టి రూ.50వేల వరకూ ఏడాదికి ఛార్జ్ చేస్తారని సమాచారం. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే.. హాలిడేలు పెద్దగా ఉండవు, టైమింగ్స్ కూడా రోజుకు 15 గంటలు తెరిచే ఉంటారు, వీటిని మన వస్తువు దాచుకున్నాం అని బయటి వాళ్లకు తెలిసే అవకాశం తక్కువ.. ఇలా ఎన్నో సౌకర్యాలను ఈ ప్రైవేట్ లాకర్స్ అందిస్తున్నాయి. అందుకే ఏడాది క్రితం వరకూ వీటికి మంచి డిమాండ్ ఉండేవి.

ఇప్పుడు దాదాపుగా దివాలా
ఈ మధ్య ఐటీ వంటి ప్రభుత్వ శాఖలు పదేపదే వీటిని రైడ్ చేయడం, కస్టమర్ల వివరాలు అడిగి తెలుసుకోవడంతో వీటిని ఆశ్రయించే వాటి సంఖ్య బాగా తగ్గిపోతోంది. ప్రధానంగా ముంబై, గుజరాత్‌లో చాలా వరకూ ప్రైవేట్ లాకర్ సేవలు మూతబట్టినట్టు నవకేతన్, కొఠారీ సేఫ్ డిపాజిట్ సంస్థల యజమానులు చెబ్తున్నారు. వీటిని నష్టాలతో నిర్వహించడం కష్టమైపోతోందనేది వాళ్ల మాట. మొత్తానికి డిమానిటైజేషన్ ఫలితం ఇలా కనిపిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications