ట్రేడ్ వార్ నేపథ్యంలో అమెరికా టారిఫ్‌లు పెంచడంపై చైనా ధీటుగా స్పందించింది. చైనా ఎప్పటికీ లొంగిపోదని డ్రాగన్ కంట్రీ వాణిజ్య శాఖ పేర్కొంది. 200 బిలియన్ డాలర్లు విలువైన వస్తువులపై టారీఫ్ వేయడంతో పాటు, మరో 300 బిలియన్ డాలర్ల చైనా వస్తువులపై టారీఫ్‌లు సిద్ధం చేయాలని ట్రంప్ అధికారులకు సూచించాడు. దీంతో ట్రేడ్ తారా స్థాయికి చేరుకుంది. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపాడు. పూర్తి వివరాలు వచ్చే వరకు వేచి చూడాలని, బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లకు చైనా తలొగ్గదని, తమ హక్కులు కాపాడుకొంటామనే నమ్మకం తమకు ఉందన్నాడు.
చైనాపై ట్రంప్ ఒత్తిడి కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఒప్పందం చేసుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని, ఇంతకుమించిన అవకాశం చైనాకు రాదని చెప్పాడు. ఒకవేళ బేరాలను కొనసాగించి తన రెండో విడత అధ్యక్ష పదవి చేపట్టిన సమయంలో చర్చలు చేపడితే దారుణపరిస్థితి ఉంటుందని, ఇలాంటి ఆఫర్లు అప్పుడు చైనాకు దక్కవని చెప్పాడు. ఇంత కంటే దారుణమైన ఒప్పందంపై చైనా సంతకం చేయాల్సి ఉంటుందన్నాడు. దీనిపై చైనా పైవిధంగా స్పందించింది.

అమెరికా, చైనాల మధ్య బుధవారం చేపట్టిన చర్చలు ఎటువంటి ఫలితం తేలకుండానే శుక్రవారం ముగిశాయి. దీనిపై చైనా ప్రతినిధి మాట్లాడుతూ మరోసారి బీజింగ్‌లో చర్చలు చేపడతామన్నాడు. కానీ, ఎప్పుడు చర్చలు చేపట్టేది వెల్లడించలేదు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇటీవల చర్చల్లో చైనా వారు బాగా దెబ్బతిన్నట్లున్నారని, అందుకే 2020లో వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాలనుకుంటున్నట్లుగా ఉన్నారని, అప్పుడు డెమోక్రాట్లు గెలిస్తే తమకు అదృష్టం కలిసి వస్తుందని చైనా భావిస్తుందని, అప్పుడు వారు అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల లబ్ది పొందే అవకాశం ఉందని భావిస్తున్నారని, కానీ, నేను మళ్లీ గెలుస్తున్నానని, అప్పుడు చైనాకు ఇప్పుడున్నంత అనుకూల డీల్ ఉండదని, అందుకే వారు తెలివిగా వ్యవహరించి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలన్నాడు.


Click it and Unblock the Notifications