For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోన్ స్విచ్చాఫ్, అజ్ఞాతంలో TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్.. ఎక్కడున్నాడు!: తొలగింపు వెనుక రాజకీయ కోణం!?

|

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా సైబరాబాద్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. టీవీ9కు సంబంధించిన పలు అంశాలు తెలుసుకునేందుకు సైబరాబాద్ ప్రత్యేక పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో అడగ్గా.. బయటకు వెళ్లారని, ఎక్కడకు వెళ్తున్నారో తమకు చెప్పలేదని తెలిపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు, రవిప్రకాశ్ పోలీసులకు సహకరిస్తారని, పది రోజుల గడువు కావాలని అతని లాయర్ పోలీసు అధికారులకు లేఖ రాశారు.

TV9 రవిప్రకాశ్ విషయంలో జరిగిందిదే!TV9 రవిప్రకాశ్ విషయంలో జరిగిందిదే!

అజ్ఞాతంలో రవిప్రకాశ్

అజ్ఞాతంలో రవిప్రకాశ్

రవిప్రకాశ్ సెల్‌ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయని తెలుస్తోంది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా పోలీసులు నిర్ధారించారని తెలుస్తోంది. ఆయన కోసం గాలింపు చర్యలు ప్రారంభించారట. రవిప్రకాశ్ కర్ణాటక మీదుగా ముంబైకి వెళ్లినట్లుగా రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. టీవీ9 మాజీ సీఎఫ్ఓ మూర్తిని పోలీసులు శుక్ర, శనివారాలు.. రెండు రోజులు విచారించారు. షేర్లు, ఆర్థిక వ్యవరాలు, ఫోర్జరీ లేఖ అంశాలపై ప్రశ్నించారని తెలుస్తోంది. నటుడు శివాజీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు.

రాజకీయ కోణం ఉందని రవిప్రకాశ్ అనుమానం

రాజకీయ కోణం ఉందని రవిప్రకాశ్ అనుమానం

అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రయివేటు లిమిటెడ్ (ఏబీసీపీఎల్) నుంచి టీవీ9ను అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కొనుగోలు చేసింది. అయితే తనపై ఆరోపణలు, ఫోర్జరీ అంశాల నేపథ్యంలో రాజకీయ కోణం ఉందని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఆరోపిస్తున్నారు. అలంద మీడియాపై రాజకీయ ప్రభావం ఉందని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీవీ9లో 90.54 శాతం వాటాలను అలంద కొనుగోలు చేసింది. శుక్రవారం సీఈవో పదవి నుంచి రవిప్రకాశ్‌ను, సీఎఫ్ఓ పదవి నుంచి కేవీఎన్ మూర్తిని తొలగించింది. అనంతరం టీవీ9 ఇంటర్మ్ సీఈవోగా కర్నాటక ఆపరేషన్స్ చూసిన మహేంద్ర శర్మను నియమించింది. సీవోవోగా సింగారావును నియమించింది.

రాజకీయ ప్రభావం

రాజకీయ ప్రభావం

రవి ప్రకాశ్ తన సీఈవో పదవికి రాజీనామా చేశాడు. ఆ లేఖలో రాజకీయ ప్రభాం ఉందని ఆరోపణలు చేశాడు. మీరు రాజకీయ పెద్ద తలకాయలకు మీడియా స్వాతంత్రాన్ని, జర్నలిస్ట్ స్వాతంత్రాన్ని తాకట్టు పెట్టారని పేర్కొన్నాడని తెలుస్తోంది. తనపై, ఇతర డైరక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని తప్పుబట్టారు. అసత్యాలతో ఫిర్యాదు చేశారని పేర్కొన్నాడు. టీవీ9లో తన వాటా ఉందని చెబుతూ, నన్ను షేర్ హోల్డర్‌గా చూడాలని, చట్టం ప్రకారం నన్ను కూడా లీగల్ ఓనర్‌గా చూడాలని పేర్కొన్నాడు. కాగా, రవిప్రకాశ్ మరో టీవీ ఛానల్‌ను తీసుకొని రన్ చేయనున్నాడని తెలుస్తోంది.

Read more about: ravi prakash
English summary

ఫోన్ స్విచ్చాఫ్, అజ్ఞాతంలో TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్.. ఎక్కడున్నాడు!: తొలగింపు వెనుక రాజకీయ కోణం!? | TV9 row: Ex CEO Ravi Prakash sees political influence

TV9 Former CEO V Ravi Prakash alleging political influence on Alanda Media and Entertainment.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X