భారత కార్పోరేట్ రంగంలో సంచలనం సృష్టించిన మైండ్ ట్రీ టేకోవర్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఐటీ సేవలు అందించే మైండ్ ట్రీ కంపెనీనిని ఎల్ అండ్ ఇన్ఫోటెక్ బలవంతంగా కొనుగోలు చేసే ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతోంది. అనేక వివాదాల మధ్య ఎట్టకేలకు ఎల్ అండ్ ట్రీ కంపెనీ.. మైండ్ ట్రీలో ప్రధాన వాటాదారుగా ఉన్న సిద్ధార్థ, ఆయన సంస్థల నుంచి 20.32 శాతం వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.
కంపెనీపై పూర్తి పట్టి సాధించేందుకు 31 శాతం వాటాకు ఓపెన్ ఆఫర్ ద్వారా ప్రస్తుత రిటైల్, వ్యవస్థాగత వాటాదారుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది కూడా. ఈ నెల 14న ప్రారంభమయ్యే ఓపెన్ ఆఫర్ మే 27న ముగియనుంది.

అయితే ఇప్పటి వరకు ఎల్ అండ్ టికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) నుంచి అనుమతి లభించలేదు. రేపు అనగా మే 13న సెబీ అనుమతి లభించకపోతే ఎల్ అండ్ టి ఓపెన్ ఆఫర్ ప్రక్రియ ఎలా ముందుకు వెళ్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఒకవేళ సెబీ అనుమతి ఆలస్యమైతే ఓపెన్ ఆఫర్ కూడా ఆ మేరకు ఆలస్యమయ్యే అవకాశాలను కొట్టి పారేయలేమని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఎల్ అండ్ టి మొత్తంగా 66 శాతం వాటాను కొనే ప్రయత్నం చేసింది. తద్వారా మైండ్ ట్రీ పైన పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications