హోండా రివర్స్ గేర్!!: మేం డీజిల్ ఇంజిన్లను కొనసాగిస్తాం
చిన్న డీజిల్ కార్ల సేల్ నిలిపివేస్తామని మారుతీ సుజుకీ ప్రకటించింది. టాటా మోటార్స్ కూడా అదే దారిలో నడిచింది. కానీ జపాన్ ఆటో దిగ్గజం హోండా మాత్రం ఇండియాలో డీజిల్ మోడల్స్ అమ్మకాలను కొనసాగిస్తామని ప్రకటించింది. BS VI నిబంధనల అమలు తర్వాత డీజిల్ ఇంజిన్ల తయారీ ఖరీదైన వ్యవహారంగా మారనుంది. ఈ నేపథ్యంలో మారుతీ, టాటా వాటిని నిలిపివేయనుంది. కానీ హోండా మాత్రం కొనసాగిస్తామని చెబుతోంది.
BS VI కఠిన నిబంధనలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్లను అప్ గ్రేడ్ చేయనుంది హోండా. హోండా రెండు రకాల డీజిల్ ఇంజిన్లను వినియోగిస్తోంది. Amaze, City, WR-V, BR-V, Civic, CR-V వంటి మోడళ్లలో వాడుతోంది. ఈ ఏడాది చివరి నుంచే హోండా తన పెట్రోల్, డీజిల్ మోడళ్లలో సరికొత్త BS VI ఇంజిన్లను అమర్చనుంది.

తమ కస్టమర్లలో చాలామంది డీజిల్, పెట్రోల్ ఇంజిన్ల ఎంపికలో స్పష్టంగా ఉంటారని, రోజువారి తిరిగే దూరం, పెట్టుబడిపై రాబటి మొత్తం అంచనా వేసుకొని ఇంజిన్లను నిర్ణయిస్తారని, 80 శాతం మంది కస్టమర్లు అలాగే నిర్ణయించుకుంటారని, కేవలం 20శాతం మంది మాత్రమే భావోద్వేగాలతో నిర్ణయించుకుంటారని హెచ్‌సీఐఎల్ (హోండా కార్స్ ఇండియా లిమిటెడ్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాజేష్ గోయెల్ అన్నాడు.


Click it and Unblock the Notifications