భారత సంతతికి చెందిన హిందూజా సోదరులు బ్రిటన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. 22 బిలియన్ పౌండ్లతో వీరు మొదటి స్థానంలో నిలగా, ముంబైలో జన్మించిన రూబెన్ సోదరులు 18.66 బిలియన్ పౌండ్లతో రెండో స్థానంలో నిలిచారు.
శ్రీ హిందూజా, గోపిచంద్ హిందూజాలు యూకేలో హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీలను రన్ చేస్తున్నారు. వీరు ఆస్తి గత ఏడాది కంటే 1.35 బిలియన్ పౌండ్లు పెరిగింది. ఈ మేరకు సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకటించింది. వీరు 2014, 2017లో మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పుడు మరోసారి ముందుకు వచ్చారు.

గోపిచంద్ హిందూజా(79), శ్రీ హిందూజా(83)తో పాటు వారి సోదరులు ప్రకాశ్ (73), అశోక్ (68)లు ఉన్నారు. ప్రకాశ్, అశోక్‌లు జెనివా, ముంబైలలో నివసిస్తారు. వీరు 50 కంపెనీలను రన్ చేస్తున్నారు. 2018లోనే టర్నోవర్ 40 బిలియన్ పౌండ్ల వరకు ఉంది.
హిందూజా ఫ్యామిలీ 2006లో క్వీన్ ఎలిజబెత్ 2 నుంచి కార్ట్‌లోన్ హౌస్ టెర్రాస్‌లో నాలుగు ఇంటర్‌కనెక్టెడ్ హోమ్స్‌ను కొనుగోలు చేసింది. హిందూజాలు మాంసం, ఆల్కాహాల్‌కు దూరంగా ఉంటారు. వీరికి ఆయిల్, గ్యాస్, ఐటీ, ఎనర్జీ, మీడియా, బ్యాంకింగ్, ప్రాపర్టీ, హెల్త్‌కేర్‌లలో వాటాలు ఉన్నాయి.
బ్రిటన్‌లోని అత్యధిక ధనవంతుల జాబితాలో హిందూజా సోదరులు గత ఏడాది రెండో స్థానంలో నిలిచారు. అంతకుముందు వారు తొలి స్థానంలో ఉండగ, గత ఏడాది రెండో స్థానానికి దిగజారారు. 2018లో బ్రిటన్ దేశానికే చెందిన రసాయనిక పరిశ్రమల పారిశ్రామికవేత్త జిమ్ రాట్ క్లిఫ్ మొదటి స్థానంలో నిలిచారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications