TV9 కొత్త యాజమాన్యం అలంద మీడియా ఎంటర్‌టైన్మెంట్స్ ప్రయివేటు లిమిటెడ్‌కు ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మధ్య విభేదాలు తలెత్తడానికి అసలు కారణం వేరే ఉందట. దాదాపు ఏడాది క్రితం అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఏబీసీఎల్)ను ఆ సంస్థ యాజమాన్యం అలంద మీడియా అనే కంపెనీకి విక్రయించింది. దీనిని రవిప్రకాశ్ ఏరికోరి తెచ్చుకున్నారట.

ఏరికోరి అలందను తెచ్చుకున్న రవిప్రకాశ్
అయితే ఏబీసీఎల్‌లో సీఈవోగా పని చేస్తున్న రవిప్రకాశ్, అతనికి సంబంధించిన వారికి మైనార్టీ వాటా 8 శాతం ఉంది. రెండు కంపెనీల మధ్య 90 శాతం వాటా విక్రయానికి సంబంధించిన పూర్తి లావాదేవీలు పూర్తయ్యాయి. కాగా రవిప్రకాశ్ మాత్రం కంపెనీలో మైనార్టీ వాటాదారుగా కొనసాగుతూ టీవీ9 సీఈవో పదవిలో ఉండాలని ఆశించారు. ఆ దిశలో పావులు కదిపారని అంటారు. కానీ రవిప్రకాశ్ ఏరికోరి తెచ్చుకున్న కొత్త యాజమాన్యం (అలంద మీడియా) అతనికి ఒక పెద్ద షాకిచ్చింది.

కానీ రవిప్రకాశ్‌కు షాకిచ్చింది
రవిప్రకాశ్ అనుకొన్ని కొనుగోలుదారుతో మరో బడా వ్యక్తి రంగ ప్రవేశం ఆయనను ఇరకాడంలో పడేసింది. అనుకోని వ్యక్తి ఆగమనం రవిప్రకాశ్‌కు మింగుడు పడలేదని విశ్వసనీయ సమాచారం. కొత్తవాటాదారు వల్ల తన వ్యూహాలు అమలు చేయడం కష్టతరమవుతుందని రవిప్రకాశ్ భావించారు. అందుకే ఆయన ఎలాగోలా డైరెక్టర్ల మార్పిడి ప్రక్రియ వేగాన్ని అడ్డుకోవడం ద్వారా కొంతకాలం టీవీ9 పగ్గాలు తన చేతిలోనే ఉంచుకోవచ్చునని భావించారట.

పదవి కోల్పోవాల్సి వచ్చింది
అయితే వచ్చిన అనుకోని కొత్త యాజమాన్యం 'పవర్'తో ప్రభుత్వ అనుమతులు కూడా చకచకా వచ్చేశాయట తద్వారా, అలంద మీడియా రవిప్రకాశ్‌కు ఉద్వాసన పలకాలని నిశ్చయిచుకొందట. అంతే, తాను ఏరికోరి తెచ్చుకున్న కొత్త యాజమాన్యం ఇచ్చిన అనుకోని షాక్‌కు రవిప్రకాశ్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చిందని మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications