Airtel బంపరాఫర్: ఈ ప్లాన్‌తో రూ.4 లక్షల ఇన్సురెన్స్, ఫోన్ కొంటే రూ.2వేలు క్యాష్ బ్యాక్, మరిన్నో...
భారతీ ఎయిర్‌టెల్ సంస్థ వినూత్న ఆఫర్‌ను తెరపైకి తీసుకు వచ్చింది. రిలయన్స్, జియో, వొడాఫోన్ ఐడియాలకు పోటీగా ఇటీవల పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను ఎయిర్‌టెల్ సమీక్షించింది. తాజాగా మరో కొత్త ప్లాన్ తెచ్చింది. ఈ ప్లాన్‌తో డేటా ప్రయోజనాలతో పాటు ఇన్సురెన్స్ కవర్ అందిస్తోంది. రూ.249 ప్రీ-పెయిడ్ ప్లాన్‌తో రూ.4 లక్షల బీమా అందిస్తోంది.

ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్
రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే నాలుగు లక్షల ఇన్సురెన్స్ పాలసీ ఉచితంగా లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ లేదా భారతీ ఎక్సా సంస్థలు ఆ పాలసీని ఆఫర్ చేస్తున్నాయి. యూజర్ల వయస్సు 18 నుంచి 54 ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. రూ.249 ప్లాన్‌తో రీజార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఓ సందేశం వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా ఇవ్వాలి అనే వివరాలు ఉంటాయి. ఆ తర్వాత ఫోన్లో ఎయిర్‌టెల్ యాప్ ద్వారా పాలసీ కాపీని పొందవచ్చు.

రూ.249 ప్లాన్‌తో ఎన్నో లాభాలు
రూ.249తో రీజార్జ్ చేసుకుంటే రోజుకు 2GB డేటాతో పాటు అన్‌లిమిడెట్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు ఫ్రీ. ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. అంతేకాదు, ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం సేవలు, జీ5, లైవ్ ఛానల్స్, సినిమాలు, ఏడాది పాటు నార్టన్ మొబైల్ సెక్యూరిటీ సేవలు, ఏదైనా కొత్త 4G ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,000 క్యాష్ బ్యాక్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది. యూజర్లు ఆఫ్‌లైన్, ఆన్ లైన్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు.

మరో ప్లాన్ కూడా
రూ.249తో ప్లాన్‌తో పాటు రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్‌కు కూడా తీసుకు వచ్చింది. ఈ ప్లాన్‌లో యూజర్లకు రోజుకు 2GB డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇస్తారు. ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. ఇందులో కూడా అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎయిర్ టెల్ టీవీ, వింకీ మ్యూజిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్, 350 లైన్ టీవీ ఛానల్స్, 10,000 మూవీస్, షోస్, ఉచిత మ్యూజిక్.


Click it and Unblock the Notifications