ఎగుమతుల ముసుగులో రూ.12.5 కోట్ల జీఎస్టీని రీఫండ్ రూపంలో వెనక్కి తీసుకునేందుకు 11 షెల్ కంపెనీలు సృష్టించారు కొందరు ప్రబుద్ధులు . . సూరత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొంత మంది వ్యక్తులు ఈ కంపెనీలను సృష్టించారు. వీటి ద్వారా ఎగుమతుల పేరుతో రూ.12.5 కోట్ల జీఎస్టీని రీఫండ్ రూపంలో వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించారు.
షెల్ కంపెనీల పేరుతో 33 కన్‌సైన్‌మెంట్లలో నాణ్యతలేని, తక్కువ ఖరీదైన వాల్ పేపర్లు, అతికించుకునే ఫిల్మ్‌లు, కెపాసిటర్లు, సిరామిక్ టైల్స్‌ను ఎగుమతి చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం ఈ వస్తువుల ధరను మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా చూపారు. అయితే ఈ వ్యవహారంపై విశ్వసనీయమైన సమాచారం అందటంతో విశాఖ కస్టమ్స్ అధికారులు కంటెయినర్లు తెరిచి చూశారు. షెల్ కంపెనీల పేరుతో చేసిన అసలు మోసం బయట పడింది.

ఈ 11 కంపెనీలు దేశంలో ఇంకెక్కడ ఇలాంటి వ్యాపారాలు చేశాయో గమనించాలని, ఇంకెన్ని షెల్ కంపెనీలు పెట్టి ఏ మేరకు మోసం చేశాయో గుర్తించాలని అన్ని విభాగాలను అప్రమత్తం చేసినట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ డీకే శ్రీనివాస్ తెలిపారు. ఈ కంపెనీల ఎగుమతులను నిలిపివేయడంతో పాటు, వాటికి ఎలాంటి ప్రయోజనాలూ కల్పించవద్దని సంబంధిత శాఖాధికారులకు లేఖ రాశామన్నారు. మొత్తానికి మోసం చేసి డబ్బు సంపాదించాలనుకుని అడ్డంగా కస్టమ్స్ అధికారులకు బుక్ అయ్యారు. కస్టమ్స్ అధికారులు వీరి ప్లాన్స్ వమ్ము చేశారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications