For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధ్యతరగతి సొంతింటి కల నెరవేర్చుకోండి.. అతి తక్కువ ధరల్లో

|

హైదరాబాద్ లో అతి తక్కువ ధరలకే ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారా? హైదరాబాద్ వంటి మహా నగరంలో అతి తక్కువ ధరకు ఇళ్లు దొరుకుతాయా అని ఆలోచిస్తున్న మధ్యతరగతి కుటుంబీకులకు శుభవార్త. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడో నగర శివార్లలో కాదు, మారుమూల ప్రాంతాల్లో అంతకంటే కాదు. నగరం నడిబొడ్డున, పూర్తి మౌలిక వసతులు ఉండేచోట అందుబాటు ధరల్లో ఇళ్ళు ఉన్నాయంటే మీరు నమ్మి తీరాలి. కాకపోతే ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. అదేనండి అందుబాటు ధరల్లో ఉన్న ఇల్లు కొత్తగా కట్టినవి కాదు అవి పాత ఇళ్లు.

జీఎస్టీ కలెక్షన్‌లలో ఆంధ్రప్రదేశ్ రికార్డ్, చిన్న రాష్ట్రాల సరసన ఏపీజీఎస్టీ కలెక్షన్‌లలో ఆంధ్రప్రదేశ్ రికార్డ్, చిన్న రాష్ట్రాల సరసన ఏపీ

అందుబాటు ధరల్లో మధ్యతరగతి సొంతింటి కల నిజం చేసే ఇళ్ళు

అందుబాటు ధరల్లో మధ్యతరగతి సొంతింటి కల నిజం చేసే ఇళ్ళు

పదేళ్లు లేదా అంతకు పూర్వం నిర్మించిన ఈ ఇళ్లు, ఫ్లాట్ల ధరలు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయి.విపరీతమైన అద్దె కట్టలేక, విపరీతమైన ధరలకు ప్లాట్ల కొనుగోలు, ఇళ్ల నిర్మాణం చెయ్యలేక ఇబ్బంది పెడుతున్న మధ్యతరగతి ప్రజానీకానికి ఈ ఇళ్ళు అందుబాటు ధరలలో లభించడం ఒక గోల్డెన్ ఛాన్స్ . భాగ్యనగరంలో విపరీతంగా పెరిగిన ఫ్లాట్ల ధరలు మధ్యతరగతి ప్రజానీకం కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఉదాహరణకు అత్తాపూర్ లో చదరపు గజం లక్ష రూపాయలు పలికితే, మాదాపూర్ లో అంతకుమించి పలుకుతుంది. ఇక అలాంటి పరిస్థితిలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టడం అంటే కలలో మాట. కాబట్టి మధ్యతరగతి ప్రజలు సిటీ లోనే అందుబాటులో ఉన్న పాత ఇళ్లపై దృష్టిసారిస్తే మీకు అనుకూలంగా ఉండే ఇల్లు తప్పక ఉంటుంది.

ముఖ్యమైన ఏరియాల్లో పాత ఇళ్ళ , ఫ్లాట్ల ధరలు

ముఖ్యమైన ఏరియాల్లో పాత ఇళ్ళ , ఫ్లాట్ల ధరలు

ఇక ధరల విషయానికి వస్తే అంబర్ పేట, నారాయణగూడ, ముషీరాబాద్, రాం నగర్ , కాచిగూడ ప్రాంతాలను పాత డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర 20 లక్షల నుండి 30 లక్షల లోపల ఉంది హిమాయత్ నగర్ లో పాత డబుల్ బెడ్రూం ఫ్లాట్ ఇదే ధర 30 లక్షల నుండి 40 లక్షల మధ్యలో దొరుకుతుంది. ఇక ఖైరతాబాద్ ,అబిడ్స్, విజయనగర్ కాలనీ, నాంపల్లి ప్రాంతాల్లో పాత డబుల్ బెడ్రూం ధర 30 లక్షల నుండి 35 లక్షల వరకు ఉంది. కొత్తపేట, దిల్ సుఖ్ నగర్ , మలక్ పేట , చైతన్యపురి కాలనీ లో పాత డబుల్ బెడ్ రూమ్ ధర 25 లక్షల నుండి 30 లక్షల రూపాయల మధ్యలో ఉంటుంది.

గేటెడ్ కమ్యూనిటీలపై ఆసక్తితో పాత ఇళ్ళు, ఫ్లాట్ల అమ్మకం

గేటెడ్ కమ్యూనిటీలపై ఆసక్తితో పాత ఇళ్ళు, ఫ్లాట్ల అమ్మకం

నగరంలో చాలామంది బాగా రద్దీగా ఉండే కాలనీల్లో ఉన్న సొంత ఇల్లు, ఫ్లాట్లు అమ్మేసి అన్ని సౌకర్యాలతో ఉండే గేటెడ్ కమ్యూనిటీ లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. దీంతో వారు నగరంలోని తమ సొంత ఇల్లు ప్లాట్లను స్థలం విలువ కే అమ్మేస్తున్నారు. సొంతింటి కల నిజం చేసుకోవాలనే మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటి ఇళ్లను కొనుగోలు చేసి రిపేర్లు చేయించుకుంటే అతి తక్కువ ధరలో సొంతిల్లు సమకూరుతుంది. అలాగే ఎక్కడో నగర శివారులో ఉన్నట్టు కాకుండా సిటీ సెంటర్ లో అన్ని మౌలిక వసతులతో ఇబ్బంది లేకుండా జీవనం సాగించవచ్చు. ఇటీవల బాగా పెరిగిన ఈ ఒరవడి కారణంగా వీటిని కొనుగోలు చేసే వ్యక్తులు, కొద్ది పెట్టుబడితో మరమ్మతులు చేసుకుని, సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. మధ్యతరగతి ప్రజానీకానికి ఈ పాత ఇళ్ళ అమ్మకాలు ఒక వరంలా మారాయి అని చెప్పొచ్చు. ఇంకెందుకాలస్యం మీ ఏరియాలోని పాత ఇళ్ళు, ఫ్లాట్ ల పై దృష్టి పెట్టండి.

English summary

మధ్యతరగతి సొంతింటి కల నెరవేర్చుకోండి.. అతి తక్కువ ధరల్లో | Make the dream of the middle class to buy a home .. at the lowest prices

Houses are avaialabe at low prices now in Hyderabad. people who are willing to live in gated communities are selling their old houses and also flats . At featured places in hyderabad like himayath nagar, narayanaguda, musheerabad ,abids , khairatabad.. etc the houses are available very economically . The middle class people can buy these houses and renovate them and can live happily. With this many can satisfy the desire of their own house .
Story first published: Saturday, May 11, 2019, 15:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X