టీవీ9 యాజమాన్యంపై తలెత్తిన వివాదంపై పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు. ఇందులో భాగంగా అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు మేరకు టీవీ9 సీఈవో రవిప్రకాశ్, ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి, నటుడు శివాజీపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి ఇళ్లలో గురువారం సోదాలు చేశారు. అనంతరం శుక్రవారం (10-05-2010) విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
శుక్రవారం మూర్తి సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. రవిప్రకాశ్, శివాజీ విచారణకు హాజరు కానందున, మరోసారి నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది. సొంత లబ్ధి కోసం ఛానల్‌కు నకిలీ పత్రాలు సృష్టించారని, ఫోర్జరీ చేశారని ఏప్రిల్ 24వ తేదీన కౌశిక్ ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు మోసం, ఐటీ చట్టం కింద రవిప్రకాశ్, మూర్తి, శివాజీలపై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు.

ఈ సెక్షన్ల కింద కేసు
అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆయన కంపెనీకి రాజీనామా చేసినట్టు పాత తేదీలతో పత్రాలు సృష్టించారని ఏబీసీఎల్‌ను కొత్తగా టేకోవర్ చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయివేటు లిమిటెడ్ డైరెక్టర్ పీ కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 30న మరో ఫిర్యాదు చేశాడు.
ఈ రెండు ఫిర్యాదులతో ఐపీసీ 406 (నమ్మకద్రోహం), 420 (మోసం), 467, 468, 469, 471 (ఫోర్జరీ), 120బీ (నేరపూరిత కుట్ర)తోపాటు ఐటీ యాక్టులోని 66, 66సీ, 66డీ, 72 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు అనుమతితో వారి ఇళ్లలో తనిఖీలు కూడా చేశారు. బంజారాహిల్స్‌లోని ఏబీసీఎల్ ఆఫీస్‌లో, బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్ ఇంట్లో, హిమయత్ నగర్ వై జంక్షన్ సమీపంలోని శివాజీకి సంబంధించిన ఇంట్లో, ఖైరతాబాద్‌లోని సీఎఫ్ఓ ఎంవీకేఎన్ మూర్తి ఇంట్లో తనిఖీలు చేశారు.


Click it and Unblock the Notifications