స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా తొమ్మిదో రోజు కూడా నష్టాల్లో ముగిసి ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచాయి. 7 నెలల తర్వాత ఒకే వారంలో ఈ స్థాయి పతనం మళ్లీ ఇప్పుడే కనిపిస్తోంది. నిఫ్టీ కీలకమైన 11,300 పాయింట్ల మార్కును కూడా నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ప్రధానంగా ఏషియన్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ మన సూచీలు మాత్రం నిలదొక్కుకోలేకపోయాయి. ఆద్యంతం ఆటుపోట్ల మధ్య కదలాడిన నిఫ్టీ చివరకు నష్టాల బాటే పట్టింది. ఇంట్రాడేలో 11346 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరిన నిఫ్టీ.. ఆఖర్లో 11251 పాయింట్ల స్థాయికి కూడా దిగొచ్చింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌లో మళ్లీ వీక్‌నెస్ మార్కెట్లను కలవరపెట్టింది. బ్యాంక్స్ కొద్దిగా ఆదుకున్న పెద్దగా సూచీలకు పెద్దగా కలిసొచ్చిందిలేదు. చివరకు 23 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 11279 పాయింట్ల దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 96 పాయింట్లు కోల్పోయి 37462 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 156 పాయింట్లు పెరిగి 29040 దగ్గర ఆగింది.
సెక్టోరల్ ఇండిసిస్‌లో భాగంగా ఐటీ, మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసిజి, ఆటో రంగ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా నమోదైంది. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ మాత్రం కాస్త పాజిటివ్‌గా కదలాడాయి. ఇక మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండూ అర శాతానికిపైగా లాభాలను నమోదు చేశాయి.

జీ ఎంటర్‌టైన్మెంట్, ఎస్బీఐ, భారతి ఎయిర్టెల్, టైటాన్, ఇండియాబుల్స్ హౌసింగ్ టాప్ ఫైవ్ లూజర్స్‌గా నిలిచాయి. టాటా స్టీల్, హెచ్ సి ఎల్, యెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లూజర్స్ జాబాతిలో చేరాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌దీ అదే దారి
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ వరుసగా ఐదో రోజు కూడా నష్టాల్లో ముగిసింది. ఇలా ఐదు వరుస సెషన్లలో పతనం ఏడు నెలల తర్వాతే రిలయన్స్‌లో కనిపిస్తోంది. మోర్గాన్ స్టాన్లీ డౌన్ గ్రేడ్‌తో పాటు మరేదో మార్కెట్లకు అంతుచిక్కని కారణంతో స్టాక్ పడ్తూ వస్తోంది. ఇప్పటికే 5 సెషన్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.1లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయింది. ఈ రోజు స్టాక్ 0.85 శాతం నష్టంతో రూ.1246 దగ్గర క్లోజైంది.
టాటా స్టీల్ కరిగింది
యూరోప్‌కు చెందిన థైసన్‌క్రూప్ కొనుగోలు విషయంలో టాటా స్టీల్ వెనక్కితగ్గనుంది. రెండు సంస్థల జాయింట్ వెంచర్‌కు యూరోపియన్ కమిషన్ పదే పదే అడ్డంకులు చెప్పడంతో ఇక డీల్ ముందుకు కదలదని అర్థమైంది. దీంతో టాటా స్టీల్ స్టాక్ ఏకంగా 8 శాతం ఇంట్రాడేలో పడింది. 10 నెలల తర్వాత ఒకే సారి ఈ స్టాక్‌లో ఈ స్థాయి పతనం నమోదైంది. చివరకు స్టాక్ 6 శాతం నష్టంతో రూ. 487.30 దగ్గర క్లోజైంది.
ఎస్బీఐకి రిజల్ట్స్ బూస్టర్
ఎస్బీఐ మెరుగైన త్రైమాసిక ఫలితాలనే వెల్లడించింది. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్‌లో రూ.840 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్ నమోదు చేసింది. అంతకు ముందు కాలంలో ఇదే సమయానికి రూ.7718 కోట్ల నికర నష్టాన్ని సంస్థ ప్రకటించింది. నిక వడ్డీ ఆదాయంలో 15 శాతం వృద్ధి, మొండిబకాయిల్లో క్షీణత వంటివి కలిసొచ్చాయి. ప్రధానంగా ప్రొవిజన్స్ ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల లాభం తగ్గిందని బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. మొత్తానికి బ్యాంక్ ఆస్తుల నాణ్యత పెరగడం కలిసొచ్చింది. దీంతో ఎస్బీఐ ఈ ఫలితాల తర్వాత 3 శాతం వరకూ పెరిగింది. చివరకు రూ.308 దగ్గర స్టాక్ క్లోజైంది.
హెచ్ సి ఎల్ టెక్‌కు రిజల్ట్స్ షాక్
ప్రధాన ఐటి సంస్థ హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ స్టాక్ ఈ రోజు భారీగా నష్టపోయింది. నిరుత్సాహక త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన నేపధ్యంలో స్టాక్.. వరస్ట్ పర్ఫార్మర్ జాబితాలో చేరింది. ఆదాయంలో కేవలం 1.9 శాతం వృద్ధి, నికర లాభంలో 2.1 శాతం క్షీణత వంటివి స్టాక్‌ను కూలదోశాయి. మార్జిన్లు 19.6 నుంచి 18.9 శాతానికి దిగొచ్చాయి. ఈ ఆర్థిక ఏడాది గైడెన్స్‌ను కూడా 16 నుంచి 14 శాతానికి తగ్గించింది హెచ్ సి ఎల్ టెక్. చివరకు ఈ స్టాక్ 4.07 శాతం నష్టంతో రూ.1086 దగ్గర క్లోజైంది.
మిడ్ క్యాప్ లూజర్స్
ఇండెక్స్‌ల పరంగా చూస్తే.. మిడ్ , స్మాల్ క్యాప్స్ లాభపడినప్పటికీ చాలా స్టాక్స్ ఈ రోజు పతనం దిశగా అడుగులు వేశాయి. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏకంగా 8 శాతానికిపైగా కోల్పోయింది. డెల్టా కార్ప్ 7 శాతం, వెంకీస్ ఇండియా 6.5 శాతం, మహానగర్ గ్యాస్ 5 శాతం నష్టపోయాయి.
ఇదే సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ 12 శాతం, ఎన్ సి సి 5 శాతం, దిలీప్ బిల్డ్‌కాన్ 5 శాతం, ఎడిల్వైజ్ ఫైనాన్స్ 4.5 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications