SBI కస్టమర్లకు శుభవార్త: లోన్ తీసుకునే వారికి ఊరట, వడ్డీ రేట్లు తగ్గింపు, ఎంత తగ్గుతుందంటే?
ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI) MCLRను 5 బేసిక్ పాయింట్స్ తగ్గించింది. తద్వారా కస్టమర్లకు వడ్డీ రేట్లు తగ్గిస్తూ కస్టమర్లకు శుభవార్త. ఈ మేరకు శుక్రవారం నాడు ప్రకటన విడుదల చేసింది. లోన్ తీసుకునే వారికి ఇది సంతోషించదగిన అంశం. ఎస్బీఐ నెల రోజుల్లో రెండుసార్లు రేట్ కట్ ప్రకటించింది. తాజాగా ప్రకటించిన రేట్ కట్ ఈ రోజు నుంచే (శుక్రవారం) అమల్లోకి వస్తుంది. అంతకుముందు ఏప్రిల్ 10వ తేదీన ద్రవ్యవిధాన పరపతి సందర్భంగా తగ్గించింది. ఇప్పుడు రెండోసారి. ఒక బేసిక్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టూ 0.01 శాతం. ఎస్బీఐ వడ్డీ రేటును తగ్గించడంతో 5.50 నుంచి 8.45 శాతానికి తగ్గింది. ఈ తగ్గింపుతో ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్‌కు ఈఎంఐ భారం తగ్గనుంది. ఎంసీఎల్ఆర్‌తో సంబంధం ఉన్న అన్ని లోన్లు తగ్గుతాయి.

హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త
ఎస్బీఐ గత నెల 10వ తేదీన కూడా 5 బేసిక్ పాయింట్స్ తగ్గించింది. అలాగే, రూ.30 లక్షల హౌసింగ్ లోన్ వరకు 10 బేసిక్ పాయింట్స్ తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెల రెపో రేటును 0.25 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులు కూడా కస్టమర్లపై బరువు తగ్గిస్తున్నాయి. ఎస్బీఐ స్టేట్‌మెంట్ ప్రకారం హోమ్ లోన్ పైన తగ్గిన మొత్తం బేసిక్ పాయింట్స్ 15. అంటే వడ్డీ రేటు 1.5 శాతం తగ్గుతుంది. దీంతో ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. హోమ్ లోన్ తీసుకున్న వారితో పాటు వెహికిల్, పర్సనల్ లోన్ తీసుకున్న వారికి కూడా వర్తిస్తుంది. అయితే రూ.1 లక్షకు పైగా రుణం తీసుకున్న వారికి వర్తిస్తుంది.

నేటి (మే 10వ తేదీ) MCLR ఎఫెక్ట్
టెనోర్ ఎగ్జిస్టింగ్ MCLR (%) రివైజ్డ్ MCLR (In %)
ఓవర్ నైట్ 8.15 8.1
వన్ మంత్ 8.15 8.1
త్రీ మంత్ 8.2 8.15
సిక్స్ మంత్ 8.35 8.3
వన్ ఇయర్ 8.5 8.45
టూ ఇయర్స్ 8.6 8.55
త్రీ ఇయర్స్ 8.7 8.65

ఎంత తగ్గుతుంది
ఉదాహరణకు మీరు రూ.25 లక్షల హౌసింగ్ లోన్‌ను 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్నారని అనుకుందాం. ఇప్పుడు 8.5 శాతం వడ్డీతో లెక్కించడం వల్ల నెలనెలా మీరు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.21,696 ఉంటుంది. అదే తాజాగా తగ్గిన 5 బేసిస్ పాయింట్లతో పోల్చిచూస్తే.. మీ ఈఎంఐ భారం రూ.21,617కి తగ్గుతుంది. అంటే నెలకు కేవలం రూ.79 మాత్రమే తగ్గినట్టు అనిపించవచ్చు. అయితే మొత్తం 20 ఏళ్ల సమయానికి ఇది మొత్తం రూ.18,970 అవుతుంది. ఈ లెక్కన ఈ 5 పాయింట్ల తగ్గింపు మీ పర్సులో రూ.19 వేలను మిగల్చబోతోంది.


Click it and Unblock the Notifications