అసత్య ప్రచారం చేశారు, థ్యాంక్స్: చానళ్లకు TV9 రవిప్రకాశ్ క్లాస్, 'వీడియో'పై ట్విస్ట్

హైదరాబాద్: టీవీ9 రవిప్రకాశ్ అజ్ఞాతంలో ఉన్నట్లుగా, పారిపోయినట్లుగా గురువారం పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రవిప్రకాశ్ స్పందించాడు. ఆయన అనూహ్యంగా గురువారం రాత్రి టీవీ9 తెరపై కనిపించారు. నాలుగు నిమిషాల పాటు మాట్లాడాడు. ఉదయం నుంచి తన అజ్ఞాతం, అరెస్టుపై గందరగోళం చెలరేగుతోందని, దానిపై వివరణ ఇచ్చేందుకే వీక్షకుల ముందుకు వచ్చానని చెప్పాడు. ఆయన 4 నిమిషాల వీడియోలో మాట్లాడింది యథాతథంగా ఇది....

మీరు చూస్తున్నారు టీవీ9, నా పేరు రవిప్రకాశ్

మీరు చూస్తున్నారు టీవీ9, నా పేరు రవిప్రకాశ్

'మీరు చూస్తున్నారు టీవీ9, నా పేరు రవిప్రకాశ్. ఈ రోజు ఉదయం నుంచి అనేక వార్తలు తెలుగు ప్రజానీకాన్ని, తెలుగు వీక్షకులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. అదే విధంగా భారత మీడియా ప్రపంచంలో కూడా ఈ వార్తలు సంచలనాన్ని రేపుతున్నాయి. రవిప్రకాశ్ రెండు రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రవిప్రకాశ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. రవిప్రకాశ్ తప్పించుకు తిరుగుతున్నారు. ఇక రవిప్రకాశ్ ఎవరో సంతకాన్ని ఫోర్జరీ చేశారు. రవిప్రకాశ్ టీవీ9 నుంచి ఇతర ఛానల్‌కు నిధులు మళ్లించారు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వార్తల్ని ప్రసారం చేయడం, స్క్రోలింగ్ నడపడం వారు చేస్తున్నారు. నా పట్ల ఇంత కన్సర్న్ ఉన్న సాటి ఛానళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను.

టీవీ9 సీఈవోగా మాట్లాడుతున్నాను

టీవీ9 సీఈవోగా మాట్లాడుతున్నాను

నేను రవిప్రకాశ్, టీవీ9 ఫౌండర్, సీఈవోగా టీవీ9 హెడ్ క్వార్టర్ బంజారాహిల్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను. గత 15 సంవత్సరాలుగా నేను ఇక్కడి నుంచే పని చేస్తున్నాను. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో టీవీ 9 ఒక స్పష్టమైన విజయకేతనాన్ని ఎగురవేసింది. జర్నలిజం అంటే మసాలా వార్తలు మాత్రమే కాదని, సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకు రావాలని కష్టపడి టీవీ9 జర్నలిస్టులు ప్రజల వద్దు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకొని, పరిష్కారం కోసం పని చేస్తున్నారు. ఈ రోజు రవిప్రకాశ్ గురించి వస్తున్న వార్తల వల్ల చాలామంది గందరగోళానికి గురయ్యారు. నాకు ఫోన్ చేస్తున్నారు. టీవీ9 ఆఫీస్‌కు ఫోన్ చేస్తున్నారు. ఏమౌతుంది, ఏం జరుగుతుందని ఆందోళనగా ఉన్నారు. ఏమీ ఆందోళన పడాల్సిన సందేశం ఇచ్చేందుకే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. ఛానళ్లు కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించి వాస్తవాలకు సంబంధించిన వార్తలు ఇస్తే బాగుంటుంది. పలానా వ్యక్తి పారిపోయాడు, పలానా వ్యక్తిని ఉరితీశాడు, పలానా వ్యక్తిని జైల్లో పెట్టారు, ఇటువంటి వార్తల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అసలు అవాస్తవం అని ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ప్రస్తుతం ఎన్సీఎల్టీ కోర్టులో ఓ కేసు ఉంది, దానిని కోర్టు స్వీకరించింది, 16వ తారీఖున కేసు విచారణకు రానుంది. ఆ వివాదాన్ని తీసుకొని కొంతమంది ఏదో తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. తప్పుడు కేసులు నిలబడవు. అవాస్తవాలు నిలబడవు. సత్యం మాత్రమే నిలబడుతుంది.

అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంపై

అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంపై

రవిప్రకాశ్ రెండు రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, పారిపోవడం వాస్తవం కాదు. మొన్న వీక్షకులు నన్ను చూశారు. నిన్న నేను బయట ఊరికి వెళ్లడం వల్ల ఆఫీస్‌కు చేరుకోవడం ఆలస్యం అయింది. టీవీ9 ఎప్పటిలాగే సామాజిక బాధ్యతతో వార్తలు మీముందుకు తీసుకు వస్తుంది. ఎటువంటి తప్పుడు ఆరోపణలైనా తిప్పికొట్టి జర్నలిజానికి సంబంధించిన సరైన విలువలతో వార్తాప్రసారాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పుకార్లు నమ్మవద్దు. మిత్రులు, మిగతా చానళ్లు.. ఉదయం నుంచి తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారికి కూడా ధన్యవాదాలు. మీరు కొంచెం బాధ్యతాయుతంగా, సరైన వార్తలను ప్రజలకు చూపించి ఉంటే ఇంకా బాగుండేది. టీవీ 9 గత పదిహేనేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో ఉంది. వీక్షకుల మనస్సు గెలుచుకుంటుంది.

ఇతర ఛానళ్లకు చురకలు

ఇతర ఛానళ్లకు చురకలు

మీరు కూడా (ఇతర చానళ్లను ఉద్దేశించి) క్రెడిబులిటీ అనే అంశం గురించి పని చేసి ఉంటే ఎవరో ఒత్తిడితో, ఎవరో ఇచ్చిన ధనాన్ని ఉపయోగించి మీరు వార్తల తయారీకి దానిని వాడకుండా ఉండి ఉంటే మీ క్రెడిబులిటీ పెరిగిఉండేది, పారదర్శకత ఉండి ఉండేది, మీ పట్ల కూడా ప్రజాభిమానం పెరిగి ఉండేదని నేను అనుకుంటున్నాను. మీరు ఇచ్చిన తప్పుడు వార్తలకు ధన్యవాదాలు. భవిష్యత్తులో అయినా మీరు క్రెడిబుల్ న్యూస్ టెలికాస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి రవిప్రకాశ్‌ను ఎవరూ అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయబోవడం లేదు. కొంతమంది కొన్ని తప్పుడు ఆరోపణలు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు, నిజం చెప్పులు వేసుకునే లోగా, అబద్దం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.. ఈ రోజు అదే జరిగింది. ఈ రోజు అమెరికా నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో, ఏం జరుగుతోంది టీవీ9 స్టూడియోలో అని. నేను టీవీ9 స్టూడియోలో ఉన్నాను, టీవీ9 సీఈవోగా మాట్లాడుతున్నాను, జర్నలిజానికి సంబంధించిన విలువల కోసం మేం ఎప్పుడు నిలబడ్డాం, భవిష్యత్తులో నిలబడతాం, జర్నలిజానికి సంబంధించిన విలువలను సమున్నతంగా నిలుపుతూ జర్నలిజం అంటే సామాజిక బాధ్యత అని మా మనసుల్లో నింపుకొని తెలుగు ప్రజలకు సేవ చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గందరగోళాన్ని కాస్త తగ్గించడానికే నేను ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను'ని పేర్కొన్నారు. కాగా, రవిప్రకాశ్ టీవీ9 స్క్రీన్‌పైకి రావడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అది రికార్డెడ్ వీడియో అని, అందుకే ఆ వీడియోలో కింద స్క్రోలింగ్, పైన డేట్ తదితర వివరాలు లేవని కేవలం లైవ్, టీవీ9 అని మాత్రమే కనిపిస్తోందని, ఇది రికార్డెడ్ అని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అజ్ఞాతం వార్తలు రావడంతో టీవీ9 సిబ్బంది ఆందోళనలో కనిపించింది. కానీ ఆయన కార్యాలయానికి రావడంతో అంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+