For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలోనే టాప్ 10 విమానాశ్రయాల్లో శంషాబాద్: టాప్ 10 బెస్ట్, వరస్ట్ ఇవే..

|

హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత దక్కించుకుంది. ఎయిర్‌హెల్ప్ (AirHelp) చేసిన సర్వేలో టాప్ 10 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. శంషాబాద్ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది. AirHelp విమాన ప్రయాణీకుల హక్కుల కోసం పని చేసే ఆర్గనైజేషన్. విమానాలు ఆలస్యమైనప్పుడు లేదా రద్దయిన సందర్భాల్లో ప్రయాణీకుల తరఫున కంపన్షేషన్ కోసం పని చేస్తుంది. ఖతార్ ఎయిర్వేస్ వరుసగా రెండోసారి మొదటి స్థానంలో నిలిచింది.

 6 నెలల్లో 11.5 లక్షల ఉద్యోగాలు, కారణాలివే 6 నెలల్లో 11.5 లక్షల ఉద్యోగాలు, కారణాలివే

టాప్ 10 బెస్ట్ విమానాశ్రయాలు ఇవే..

టాప్ 10 బెస్ట్ విమానాశ్రయాలు ఇవే..

1. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఖతారు (DOH)

2. టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, జపాన్ (HND)

3. ఆల్‌థీన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, గ్రీస్ (ATH)

4. అఫోన్సో పెనా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, బ్రెజిల్ (CWB)

5. డాన్స్క్ లెచ్ వాసా ఎయిర్ పోర్ట్, పోలాండ్ (GDN)

6. షెరెమెటేవో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, , రష్యా (SVO)

7. చాంఘీ ఎయిర్ పోర్ట్ సింగపూర్, సింగపూర్ (SIN)

8. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, , ఇండియా (HYD)

9. టెనెరిఫ్ నార్త్ ఎయిర్ పోర్ట్, స్పెయిన్ (TFN)

10. విరాకోపస్/కాంపినస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, బ్రెజిల్ (VCP)

టాప్ 10 వరస్ట్ విమానాశ్రయాలు ఇవే...

టాప్ 10 వరస్ట్ విమానాశ్రయాలు ఇవే...

1. లండన్గాట్విక్ ఎయిర్ పోర్ట్, యునైటెడ్ కింగ్‌డమ్ (LGW)

2. బిల్లీ బిషప్ టోరోంటో సిటీ ఎయిర్ పోర్ట్, కెనడా (YTZ)

3. పోర్టో ఎయిర్ పోర్టు, పోర్చుగల్ (OPO)

4. పారిస్ ఓర్లీ ఎయిర్ పోర్ట్, ఫ్రాన్స్ (ORY)

5. మాంచెస్టర్ ఎయిర్ పోర్ట్, యూనైటెడ్ కింగ్‌డమ్ (MAN)

6. మాల్తా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, మాల్తా (MLA)

7. హెన్రీ కోండల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రొమేనియా (OTP)

8. ఈందోవెన్ ఎయిర్ పోర్ట్, నెదర్లాండ్స్ (EIN)

9. కువైట్ ఇంటర్ేషనల్ ఎయిర్ పోర్ట్, కువైట్ (KWI)

10. లిస్బన్ పోర్టేలా ఎయిర్ పోర్ట్, పోర్చుగల్ (LIS)

చోటు దక్కని అమెరికా, యూకే విమానాశ్రయాలు

చోటు దక్కని అమెరికా, యూకే విమానాశ్రయాలు

అమెరికా, యూకే నుంచి ఏ విమానాశ్రయాలు కూడా టాప్ 10లో చోటు దక్కించుకోలేదు. ఎయిర్ పోర్ట్ ఆన్‌టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్‌ అవకాశాల వంటివి పరిగణనలోకి తీసుకుని విమానాశ్రయాలకు ర్యాంకింగ్స్‌ ఇచ్చారు. 40 దేశాల్లోని 40వేల మంది ప్రయాణికులతో సర్వే జరిపి ఈ జాబితా రూపొందించింది. 2015 నుంచి ఎయిర్ హెల్స్‌ ఇలా విడుదల చేస్తోంది. అప్పటి నుంచి హమద్‌, టోక్యో, ఏథెన్స్‌ విమానాశ్రయాల్లో వరుసగా టాప్‌ 3 లో ఉంటున్నాయి. వీటితో పాటు ఎయిర్ లైన్లకు ర్యాంకింగ్‌ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్‌గా ఖతార్‌ ఎయిర్‌వేస్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ రెండు, ఏరోమెక్సికో మూడో స్థానం దక్కించుకున్నాయి.

2019లో టాప్ 10 ఎయిర్ లైన్స్

2019లో టాప్ 10 ఎయిర్ లైన్స్

2019లో టాప్ 10 ఎయిర్ లైన్స్ ఖతార్ ఎయిర్వేస్, అమెరికన్ ఎయిర్ లైన్స్, ఏరోమెక్సికో, ఎస్ఏఎస్ స్కాండినవియన్ ఎయిర్ లైన్స్, కాంటాస్, లాటామ్ ఎయిర్ లైన్స్, వెస్ట్ జెట్, లగ్జెయిర్, ఆస్ట్రేలియన్ ఎయిర్ లైన్స్, ఎమిరేట్స్.టాప్ 10 ఎయిర్ లైన్స్‌లలో ఆండ్రియా ఎయిర్వేస్, ఏరోలినియాస్ అర్జెంటినాస్, ట్రాన్‌సేవియా, లూడోమోషన్, నార్వేజియన్, రైయనయర్, కొరియన్ ఎయిర్, కువైట్ ఎయిర్వేస్, ఈసీజెట్, థామస్ కుక్ ఎయిర్ లైన్స్.

English summary

ప్రపంచంలోనే టాప్ 10 విమానాశ్రయాల్లో శంషాబాద్: టాప్ 10 బెస్ట్, వరస్ట్ ఇవే.. | Hyderabad's Rajiv Gandhi Airport ranked among top 10 in the world

Hyderabad’s Rajiv Gandhi International Airport Or Shamshabad Ariport has been ranked as the world's eighth best in a survey.
Story first published: Friday, May 10, 2019, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X