BSNL బెస్ట్ ఆఫర్: రూ.47కే మరింత డాటా, రెండు ప్లాన్ వివరాలివీ
టెలికం రంగంలో పోటీ నెలకొని ఉంది. ప్రయివేటు ప్రొవైడర్లను తట్టుకొనేందుకు గత కొన్నాళ్లుగా బీఎస్ఎన్ఎల్ కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్స్ తీసుకు వస్తోంది. ఉన్నవారిని కాపాడుకుంటూ, కొత్త యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల రెండు ప్రీపేయిడ్ రీచార్జ్ ప్లాన్స్ తీసుకు వచ్చింది. ఇందులో ఒకటి రూ.47, మరొకటి రూ.198 ప్లాన్.
మొదటి ప్లాన్ (రూ.47)లో అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ కేవలం 9 రోజులు మాత్రమే. ఈ ప్లాన్‌లో 1జీబీ డేటా ఆఫర్ చేస్తున్నారు. 2జీ, 3జీ నెట్ వర్క్స్‌కు ఇది వర్తిస్తుంది.
రూ.198 ప్లాన్‌లోకూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇదివరకు ఇది 28 రోజుల ప్లాన్. అలాగే రోజుకు 1.5 జీబీ డేటా ఇచ్చేవారు. ఇప్పుడు 54 రోజులకు పెంచారు. అలాగే రోజుకు 2 జీబీ అలాట్ చేస్తారు.

అంతకుముందు, ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా రెండు న్యూ రీచార్జ్ ప్లాన్స్ తీసుకు వచ్చింది. రూ.199 రీచార్జ్ ప్యాక్‌కు 28 రోజుల వాలిడిటీ ఇచ్చింది. ఈ ప్లాన్‌తో యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు (రోజుకు) ఇచ్చింది. రోజుకు 1 జీబీ డేటా ఆఫర్ చేసింది. దీంతో పోలిస్తే ఇప్పుడు తీసుకువచ్చిన రూ.198 ప్లాన్ బెట్టర్‌గా భావిస్తున్నారు.
ఐపీఎల్ కోసం బీఎస్ఎన్ఎల్ తీసుకు వచ్చిన రెండో ప్లాన్ రూ.499. 90 రోజుల వాలిడిటీ ఉంది. అంటే మూడు నెలలు. బెనిఫిట్స్ మాత్రం తొలి స్కీంలాగే ఉంటాయి. రోజుకు 1 జీబీ డాటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్డీటీ, రోమింగ్ కాల్స్.
ఇదిలా ఉండగా, బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు రంజాన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తీసుకు వచ్చింది. వచ్చే నెల 6వ తేదీ వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద ఫ్యాన్సీ నెంబర్లపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలంగాణ టెలికం సర్కిల్ ప్రకటించింది. 786తో ముగిసే నెంబర్లకు రూ.600కు బదులు రూ.300, 786బీతో ముగిసే నంబర్లకు రూ.100కు బదులు రూ.50 చెల్లించి తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications