సమ్మర్ సీజన్‌లో ఎయిర్ కండిషనర్ (ఏసీ), ప్రిడ్జ్‌లు బాగా సేల్ అవుతాయి. ప్రతి ఇల్లు లేదా ఆఫీసులో ఏసీ అయితే తప్పనిసరిగా భావిస్తారు. ఏసీలు కొనుగోలు చేసే సమయంలో ప్రోడక్ట్ బ్రాండ్, కూలింగ్ కెపాసిటీ, ఎనర్జీ ఎఫిసియెన్సీ తదితర ఎన్నో వివరాలు తెలుసుకొని కొనుగోలు చేస్తారు. పైగా, వేసవి కాలంలో పలు కంపెనీలు, వ్యాపార సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ప్రకటిస్తాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ కూడా ఏసీ కొనుగోలుపై ఆఫర్ ఇస్తోంది.

ఎస్బీఐ క్యాష్ బ్యాక్
ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1,500 ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఎంపిక చేసిన (సెలెక్టెడ్) స్టోర్‌లలో ఈ ఆఫర్ ఇస్తోంది. మే 30, 2019 వరకు ఎస్బీఐ కార్డు ద్వారా ఏసీని కొనుగోలు చేస్తే రూ.1,500 ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అప్లై అవుతుంది. ఈఎంఐ 3 నెలలు, 6 నెలలు, 9 నెలలుగా ఉన్నాయి. కనీస ఆర్డర్ వ్యాల్యూ రూ.20,000గా ఉండాలి.

ఎంపిక చేసిన స్టోర్‌లలో క్యాష్ బ్యాక్
ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ లార్జ్ ఫార్మాట్ ఎలక్ట్రానిక్ చైన్, జనరల్ ట్రేడ్ మర్చంట్ ఔట్‌లెట్‌లలో లభిస్తుంది. ఏసీని కొనుగోలు చేసేందుకు ఏదైనాస్టోర్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందా అని అడిగి తెలుసుకోవాలి.

రూ.1,500 క్యాష్ బ్యాక్
ఎస్బీఐ కార్డు 3, 6, 9, 12 నెలల కాలపరిమితికి 14 శాతం వడ్డీని విధిస్తోంది. 18 నెలలు, 24 నెలల కాలపరిమితికి 15 శాతం వడ్డీని విధిస్తోంది. బ్రాండ్ ఈఎంఐ ఆప్షన్ కింద పిన్‌ల్యాబ్స్ స్విప్ మిషన్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. చార్జ్ స్లిప్‌లో రూ.1,500 క్యాష్ బ్యాక్ మెన్షన్ చేస్తారు. కస్టమర్లు ఈ చార్జ్ స్లిప్‌ను ఈఎంఐ ముగిసే వరకు దీనిని దగ్గర ఉంచుకోవాలి. ఈ క్యాష్ బ్యాక్ కస్టమర్ అకౌంట్‌లో ఆగస్ట్ 30, 2019లోగా పడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఆయా వ్యాపార సంస్థల ఎగ్జిస్టింగ్ ఆఫర్లు, గిఫ్ట్స్, డిస్కౌంట్స్ ఇస్తాయి. వాటికి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ ఆఫర్ మరింత అదనం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications