ఎనిమిదో రోజూ స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. సూచీలు రెండు నెలల కనిష్టానికి దిగొచ్చాయి. మూడు నెలల తర్వాత వరుసగా ఇన్ని రోజులపాటు నష్టాన్ని మార్కెట్లు మూటగట్టుకున్నాయి. ఇంట్రాడేలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సూచీలు.. చివరకు భారీగానే నష్టపోయాయి. అమెరికా - చైనాల మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధానికి తోడు దేశీయంగా అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను పడదోసింది. హెవీ వెయిట్ స్టాక్ కావడంతో దాని ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ ఈ రోజు ప్రారంభంలో 11,357 పాయింట్ల గరిష్ట స్థాయికి వెళ్లినప్పటికీ.. అమ్మకాల నేపధ్యంలో 11,255 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగొచ్చింది. సుమారు 100 పాయింట్ల పతనాన్ని చవిచూసినప్పటికీ ఆఖరి గంటలో 50 పాయింట్ల వరకూ రికవరీ కాస్త ఊరటనిచ్చింది. చివరకు నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 11,302 పాయింట్ల దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 230 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్ల వరకూ కోల్పోయింది.
మీడియా, ఐటీ, ఎఫ్ఎంసిజి, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ కౌంటర్లలో కొద్దిగా కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ప్రధానంగా మెటల్, ఫార్మా, బ్యాంకింగ్ కౌంటర్లలో సెల్లింగ్ ప్రెషర్ నమోదైంది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఆఖర్లో అనూహ్యంగా కోలుకున్నా చివరకు స్పల్ప నష్టాల్లో ముగిశాయి.
జీ ఎంటర్‌టైన్మెంట్, యెస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హీరో మోటోకార్ప్ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. రిలయన్స్, బీపీసీఎల్, భారతి ఎయిర్టెల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ షేర్లు లూజర్స్ జాబితాలో చేరాయి.

రూ.97000 కోట్లు ఆవిరి !
ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఈ రోజు కూడా మూడున్నర శాతం వరకూ నష్టపోయింది. రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ.. ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ సంస్థ పనితీరు ఈ ఏడాది కాస్త నీరసించవచ్చని విశ్లేషించింది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో స్టాక్ బాగా పెరగడం వల్ల లాభాల స్వీకరణ కూడా వస్తోంది. దీంతో నాలుగు రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 12 శాతం వరకూ కోల్పోయింది. మొత్తమ్మీద వరుస సెషన్ల నష్టాల వల్ల రూ.97000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది.
ఐదు రోజుల నష్టాలకు బ్రేక్
వరుస నష్టాలతో కుదేలవుతూ వస్తున్న జీ ఎంటర్‌టైన్మెంట్ స్టాక్ ఈ రోజు భారీగా లాభపడింది. వాటాల అమ్మకంపై సంస్థ యాజమాన్యం కాన్ఫిడెంట్‌గా ఉండడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దీంతో స్టాక్ ఏకంగా 8 శాతం లాభపడింది. చివరకు రూ.358 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో గ్రూప్ సంస్థ డిష్ టీవీ 8.2 శాతం లాభపడి రూ.33.70 దగ్గర ముగిసింది. జీ మీడియా స్టాక్ కూడా 6.5 శాతం పెరిగింది. ఈ రంగానికే చెందిన సన్ టీవీ కూడా 3 శాతం పెరగడం గమనించాల్సిన అంశం.
యెస్ బ్యాంక్‌లో జోష్
యెస్ బ్యాంక్ మళ్లీ లాభాల బాటలోకి వస్తోంది. స్టాక్ ఏకంగా 6 శాతం లాభపడడం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం. చివరకు రూ.170 దగ్గర స్టాక్ క్లోజైంది.
మిడ్ క్యాప్ యాక్షన్
గతవారం కొద్దిగా లాభాల స్వీకరణకు గురైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్టాక్ ఈ రోజు మళ్లీ లాభాల బాటలో పయనించింది. స్టాక్ 6 శాతం పెరిగి రూ.15.90 దగ్గర క్లోజైంది. ఇంతటి మార్కెట్ బలహీన కండిషన్స్‌లో కూడా ఎడిల్వైజ్ ఫైనాన్స్ 4 శాతానికి పైగా పెరిగి రూ.152.65 దగ్గర క్లోజైంది. ఇక్కడి నుంచి కూడా స్టాక్ మరింతగా జోరు పుంజుకోవచ్చని టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గత కొద్ది కాలం నుంచి నీరసంగా ఉన్న రాంకీ ఇన్‌ఫ్రాలో ఈ రోజు సడెన్ జంప్ నమోదైంది. స్టాక్ 13 శాతం పెరిగి రూ.100 మార్కును క్రాస్ చేసింది. రూ.103 దగ్గర క్లోజైంది. గ్రాఫైట్ సంబంధ స్టాక్స్ అయిన హెచ్ ఈ జీ, గ్రాఫైట్ ఇండియాలో మరో రౌండ్ సెల్లింగ్ నమోదవుతోంది. ఈ రెండు స్టాక్స్ ఈ రోజు 4 శాతం వరకూ కోల్పోయాయి.
More From GoodReturns

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications