For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ఎస్సెమ్మెస్ అలర్ట్: ఇలా యాక్టివేట్ చేసుకోండి

|

మీ బ్యాంక్ అకౌంట్ సురక్షితంగా ఉండటం మీ చేతుల్లో ఉంది. మన అకౌంట్‌లోని డబ్బులు భద్రంగా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు ఎస్సెమ్మెస్ సేవలు ఎంతో ఉపయోగపడతాయి. అది ఏ బ్యాంక్ అయినా ఎస్సెమ్మెస్ అలర్ట్ ఉంటే మంచిది. మనం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయగానే సందేశం వచ్చేలా యాక్టివేట్ చేసుకోవాలి.

How to activate SMS alert service of SBI

అలా అయితే మీ డబ్బులు ఎవరైనా డ్రా చేసినా వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి మీకు తెలియకుండా డబ్బులు డ్రా అనే సమస్య ఉండదు. ఎస్సెమ్మెస్ అలర్ట్ ఉంటే మీ అకౌంటుకు సంబంధించిన సమాచారం అంటే పాస్‌వర్డ్ మార్చినప్పుడు, లాగిన్ అయిప్పుడు కూడా తెలిసిపోతుంది. మీ అకౌంట్ లావాదేవీలకు సంబంధించి అలర్ట్స్ వస్తాయి. ఎస్బీఐలో ఎటీఎం అలర్ట్ ఇలా యాక్టివేట్ చేసుకోండి.

SBI, HDFC, ICICI మినిమం బ్యాలెన్స్: పెనాల్టీ తప్పించుకోండి!SBI, HDFC, ICICI మినిమం బ్యాలెన్స్: పెనాల్టీ తప్పించుకోండి!

ఏటీఎం సెంటర్

ఏటీఎం సెంటర్

- ఏదైనా ఏటీఎం సెంటర్‌కు వెళ్లండి.

- మీ ఏటీఎం కార్డు ఇన్‌సర్ట్ చేయండి.

- Mobile Registrationను సెలక్ట్ చేయండి.

- SMS/Mobile Registrationకు వెళ్లండి.

- ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. మెసేజ్ అలర్ట్ ఏ నెంబర్‌కు కావాలో అడుగుతుంది.

- మీరు మొబైల్ నెంబర్ కన్‌ఫర్మ్ చేశాక, రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. మీ ట్రాన్సాక్షన్ స్లిప్ పైన కూడా 'Your request for registration has been accepted' అని వస్తుంది.

- ఒకవేళ సక్సెస్ కాకుంటే మరోసారి పైవిధంగానే చేయండి. ఏదైనా సమస్య వస్తే మాత్రం బ్యాంకుకు వెళ్లి సమస్య ఏమిటో తెలుసుకోండి.

ఆన్‌లైన్ ద్వారా

ఆన్‌లైన్ ద్వారా

- మొదట https://www.onlinesbi.com/ వెబ్ సైట్‌లోకి లాగిన్ అవండి.

- మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

- ఈ-సర్వీసెస్ సెక్షన్‌లో ఎస్సెమ్మెస్ అలర్ట్ పైన క్లిక్ చేయాలి.

- తర్వాత ఎస్సెమ్మెస్ అలర్ట్స్ రిజిస్ట్రేషన్/అప్‌డేషన్ పేజీ కనిపిస్తుంది.

- అక్కడ అడిగిన సమాచారం ఇచ్చి, సబ్‌మిట్ చేయాలి. తర్వాత ఎస్బీఐ అలర్ట్ యాక్టివేట్ అవుతుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు ఎస్సెమ్మెస్ అలర్ట్స్ వస్తాయి.

- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కే అలర్ట్స్ వస్తాయి. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ కాకుంటే సంబంధిత బ్రాంచికి వెళ్లండి.

- మీ అకౌంట్ ఆక్టివిటీ పైన ఎస్సెమ్మెస్ అలర్ట్ ఆధారపడి ఉంటుంది.

- ఫోన్ నెంబర్ యాడ్ లేదా అప్‌డేట్ కోసం బ్రాంచికి వెళ్లండి.

Read more about: sbi atm online ఎస్బీఐ
English summary

SBI ఎస్సెమ్మెస్ అలర్ట్: ఇలా యాక్టివేట్ చేసుకోండి | How to activate SMS alert service of SBI

Everything is getting advanced day by day in this technology era. Nothing is left today which is not having technology touch.
Story first published: Thursday, May 9, 2019, 17:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X