అక్షయ తృతీయ తర్వాత పెరుగుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు గురువారం నాడు పెరిగాయి. బంగారాన్ని పెట్టుబడుదారులు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తారు. 22 క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర రూ.3,118, 10 గ్రాములు రూ.31,180గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,180గా ఉంది. వీటి ధరలు పది గ్రాములకు రూ.280 పెరిగింది.
అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో 8వ తేదీన బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.180 పెరిగింది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,670 నుంచి రూ.32,850కి పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,500 నుంచి రూ.32,680కి పెరిగింది. బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది. వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.38,120 నుంచి రూ.38,220కి చేరుకుంది.


Click it and Unblock the Notifications