వాస్తవానికి రవిప్రకాష్.. టీవీ9లో ఓ సాధారణ ఉద్యోగి మాత్రమే. అయితే సంస్థ ఏర్పాటు దగ్గరి నుంచి ఆయన చాలా కీలకపాత్ర పోషించారు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన నూతన ఒరవడి సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. టీవీ9 అనే సంస్థను ఐటీ రంగంలో సేవలు అందించే బిజినెస్‌మెన్ శ్రీనిరాజు స్థాపించారు. టీవీ9 సంస్థకు ఆపరేట్ చేసేందుకు అసోసియేటెడ్ బ్రాడ్‌క్యాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ - ఏబిసిఎల్‌ను స్థాపించారు. ఇందులో ప్రమోటర్ అయిన శ్రీనిరాజుకు చెందిన చింతలాపాటి హోల్డింగ్స్, ఐల్యాబ్స్ వెంచర్స్ క్యాపిటల్ ఫండ్‌కు 90 శాతం మెజార్టీ వాటాలున్నాయి. ఏబీసీఎల్‌లో ఉద్యోగిగా కెరీర్ మొదలుపెట్టిన రవిప్రకాశ్ సహా కొంత మంది ఉద్యోగులకు 9 నుంచి 10 శాతం వరకూ మాత్రమే సంస్థలో వాటాలున్నాయి. మామూలు ఉద్యోగి నుంచి సంస్థలో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు రవిప్రకాశ్. ఇదే సమయంలో సంస్థ తెలుగు నుంచి కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఇంగ్లిష్, హిందీ భాషలకు కూడా విస్తరించి జాతీయ స్థాయి నెట్వర్క్‌గా పేరుతెచ్చుకుంది. అయితే ఎప్పుడు ప్రమోటర్ అయిన శ్రీనిరాజు టీవీ9 కార్యకలపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం.. కేవలం ఇన్వెస్టర్‌గా వెనుక నుంచి మాత్రమే నడిపించడం వల్ల చాలామంది.. రవిప్రకాశ్‌దే టీవీ9 అని భావించేవారు.
మెరుగైన సమాజంలో కానరాని రవి ప్రకాశ్..! 9అలిగేషన్స్ విత్ RP..!!

8 శాతం వాటాతోనే చక్రం తిప్పారా
అన్నీ బాగున్నప్పుడు.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తేడా ఉన్నప్పుడే వ్యవహారం బెడిసి కొడ్తుంది. ఇక్కడ.. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇంతకాలం అటు మేనేజ్‌మెంట్‌కు - ఉద్యోగులకు మధ్యా ఎలాంటి పొరపచ్చాలూ రాలేదు. తాజాగా ఏబీసీఎల్‌లో 90 శాతం వాటాను హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అంట్ ఎంటర్‌టైనమెంట్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ.500 కోట్ల వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాల టాక్. అయితే కొత్త యాజమాన్యానికీ.. రవిప్రకాశ్‌కు మధ్య ఎక్కడో వ్యవహారం చెడిందనిపిస్తోంది. ఎందుకంటే.. కొత్త మేనేజ్మెంట్‌కు రవిప్రకాశ్ సహకరించడం లేదనేది తాజా ఆరోపణ. కొత్తగా బోర్డులోకి వచ్చిన నలుగురు డైరెక్టర్ల నియామకం మొదలు .. వాళ్లు మీటింగ్ ఏర్పాటు చేసుకునేంత వరకూ అనేక అడ్డంకులను రవి సృష్టించాడని తాజాగా యాజమాన్యం ఫిర్యాదు చేస్తోంది. కేవలం ఏడెనిమిది శాతం వాటా మాత్రమే ఉన్న రవిప్రకాశ్.. కొత్త యాజమాన్యానికి సహకరించకపోగా.. మరింత అడ్డంకులు సృష్టిస్తున్నారని కొద్దికాలం నుంచి గొడవ నడుస్తున్న నేపధ్యంలో ఇది ఇప్పుడు తారా స్థాయికి చేరింది.

రవిప్రకాశ్ ఏం ఫోర్జరీ చేశారు
ఏబీసీఎల్‌తో అలందా మీడియా సంస్థకు ఈ ఏడాది మార్చి నెలలో అధికారికంగా ఒప్పందం కుదిరింది. డీల్ గతేడాది అక్టోబర్‌లోనే కుదిరినప్పటికీ వివిధ వివాదాల నేపధ్యంలో అది ఆలస్యమైంది. కొత్త యాజమాన్యానికి చెందిన నలుగురు డైరెక్టర్లు టీవీ9లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. దీనికి సంబంధించిన వివరాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌తో పాటు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు కూడా పంపించారు. దీనికి మార్చి నెలాఖరులో ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ నుంచి అనుమతి కూడా అందింది. తమను బోర్డులోకి తీసుకునే అంశాన్ని వేగవంతం చేయాలని రవిప్రకాశ్ అండ్ టీంతో పాటు కంపెనీ సెక్రటరీకి కూడా వాళ్లు వర్తమానం పంపారు. అయితే కొత్త మేనేజ్మెంట్ మాటల ప్రకారం.. ఇక్కడ రవి అండ్ టీం.. తన చేతివాటం చూపించింది. కంపెనీ సెక్రటరీ పేరుతో ఓ లేఖను తయారు చేసి.. రాజీనామా చేసినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు పంపించారు. అది కూడా ముందు తేదీలతో ఈ ఫోర్జరీ లెటర్ రూపొందించారని తెలుసుకున్న కొత్త టీం.. సదరు సమచారాన్ని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లింది. వేరే ప్రయత్నాలు చేసుకుని కొత్తగా నలుగురు డైరెక్టర్‌లూ ఏబీసీఎల్ బోర్డులో చేరారు. ఫోర్జరీ సంతకాలు, కంపెనీ సెక్రటరీ పేరుతో లెటర్లు వంటివి చేయడంతో సీరియస్ అయిన అలందా మీడియా రవిప్రకాశ్ పై కేసు పెట్టింది.

శివాజీ ఎక్కడి నుంచి వచ్చాడు
నటుడు శివాజీ.. రవిప్రకాశ్‌కు మధ్య అతి సన్నిహిత సంబంధాలున్న సంగతి ప్రపంచానికి మొత్తం తెలుసు. శివాజీని ఉన్నట్టుండి ఓవర్ నైట్ పొలిటికల్ స్టార్‌ను చేయడంతో టీవీ9 తనవంతు బాధ్యతను పోషించింది. ఇక ఈ కేసులో శివాజీ ఎంట్రీ గురించి తెలుసుకోవాలి. అలందా మీడియా - ఏబీసీఎల్ డీల్ పూర్తైన తర్వాత నటుడు శివాజీ తెరంగేట్రం చేశాడు. రవిప్రకాశ్ దగ్గరి నుంచి తాను 40 వేల షేర్లు కొనుగోలు చేశానని, ఇందుకు సంబంధించి ఇద్దరి మధ్యా 2018 ఫిబ్రవరిలోనే ఒప్పందం కుదిరిందని శివాజీ చెప్పుకొచ్చారు. అయితే తన దగ్గర రూ.20 లక్షల డబ్బులు తీసుకుని కూడా.. రవిప్రకాశ్ తనకు షేర్లను బదలాయించలేదని.. అందుకే తన వ్యవహారం సెటిల్ అయ్యేంత వరకూ అలందా మీడియా - ఏబీసీఎల్ మధ్య డీల్ అపాలని ఏకంగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు వెళ్లకుండా నేరుగా ట్రైబ్యునల్‌కు శివాజీ వెళ్లడం వెనుక ఏదో శక్తి ఉన్నట్టు కొత్త టీం గుర్తించింది. అందుకే ఈ కేస్‌లో శివాజీని కూడా లాగింది. ఇద్దరూ కలిసి ఏదో కుట్రపన్నారనే ఉద్దేశంతో కేసులు పెట్టింది.
ఎవరిదీ అలందా మీడియా
రిజిస్ట్రీ ఆఫ్ కంపెనీస్ అధికారిక సమాచారం ప్రకారం.. అలందా మీడియాలో మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనతో పాటు ప్రేమ్ కుమార్ పాండే అనే మరో డైరెక్టర్ ఉన్నారు. ఆయన మెగా ఇంజనీరింగ్ గ్రూపు సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరితో పాటు మునగాల అర్జున్ ప్రణీత్, పుల్లూరి కౌశిక్ రావు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. వీళ్లిద్దరూ అనేక రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. మొత్తానికి మై హోం అధినేత రామేశ్వరరావు, మెగా ఇంజనీరింగ్ ప్రమోటర్ల చేతిలోకి టీవీ9 వెళ్లిందనేది స్పష్టమవుతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications