BYJU'S ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరో మహేష్ బాబును తమ ప్రచారకర్తగా నియమించింది. ఇది ఎడ్యుకేట్ యాప్. విద్యార్థులకు అభ్యాసపరమైన శిక్షణకు ఉపకరించే ఎడ్యుకేట్ కంపెనీ బైజూస్ యాప్. దీనికి ఇప్పుడు సూపర్ స్టార్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్ల కోసం ఈ ప్రచార చిత్రం, సామాగ్రిని ప్రత్యేకంగా రూపొందించారు. విద్యార్థుల్లో మారిన అధ్యయన ధోరణులు, కాన్సెప్టువల్ లర్నింగ్ ప్రాధాన్యం వంటి అంశాలను ఈ యాడ్ హైలెట్ చేయనుంది.

ఏపీ, తెలంగాణ మార్కెట్లు ఎంతో కీలకం
ఈ సందర్భంగా BYJU'S చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మృణాల్ మోహిత్ మాట్లాడారు. ఏపీ, తెలంగాణ మార్కెట్లు తమకు ఎంతో కీలకమైనవిగా భావిస్తున్నామని చెప్పారు. యాప్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నమోదవుతున్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు బాగా పెరుగుతోందన్నారు. ఇప్పుడు మహేష్ బాబు ప్రచారం చేయడం ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరింత చేరువ అయ్యేందుకు ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ప్రశ్నలు సంధించడాన్ని ప్రోత్సహించాలని, టెక్నాలజీ ఆధారిత అభ్యాసం ద్వారా సుదీర్ఘకాలం పాటు వారికి ఆ విషయాలు గుర్తుంటాయని నటుడు మహేష్ బాబు అన్నారు.

బాబాయ్‌గా మహేష్ బాబు
ఈ యాడ్ (ప్రకటన) విద్యార్థుల లర్నింగ్ హాబిడ్స్‌ను వికసింపచేసేదిగా, కాన్సెప్ట్‌వల్ లర్నింగ్, ప్రభావవంతమైన అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ యాడ్‌లో మహేష్ బాబు యంగ్ అంకుల్ (బాబాయి) రోల్‌లో కనిపిస్తారు. తన అన్నయ్య కొడుకు బైజూస్ యాప్ ద్వారా ఎంత చకచకా లెక్కలు చేయగలడో తెలుసుకునే బాబాయ్ రోల్‌లో మహేష్ బాబు కనిపిస్తున్నారు. తాను సరికొత్త పద్ధతిలో (బైజూస్ ద్వారా) లర్నింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్నట్లు క్రికెట్ ఆడేందుకు వెళ్తున్న బాలుడు తన తండ్రి, బాబాయ్ (మహేష్ బాబు)కు చెబుతాడు.
ప్రచార వీడియోలో ఇలా.. ఇదీ యాడ్
క్రికెట్ ఆడేందుకు వెళ్తున్న తన అన్న కొడుకు రాహుల్‌తో మహేష్ బాబు.. అరేయ్ రాహుల్, చదువు మానేసి ఈ ఆటలేమిట్రా, వెళ్లి పుస్తకం తియ్, మ్యాచ్ గెలిస్తే సరిపోదని, మ్యాథ్స్ మళ్లీ మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేయాలని చెబుతాడు.
దానికి ఆ బాలుడు బైజూస్ యాప్‌లో అర్థం చేసుకొని చదువుతానని, అందుకే లెక్కలు చకచకా చేయగలనని సవాల్ చేస్తాడు.
దానికి మహేష్ బాబు, ఈ కథలు మీ నాన్నకు చెప్పు, వీడికి అల్‌జీబ్రాలో గట్టి లెక్క ఒకటి చెప్పమని తన అన్నయ్యకు చెబుతాడు.
అప్పుడు ఆ అన్నయ్య ఓ లెక్క ఇస్తాడు.
తన అన్నయ్య అడిగిన లెక్కను ఉద్దేశించి మహేష్ బాబు.. ఏమడిగావు అన్నయ్యా, ఇప్పుడు చెప్పరా అని బాలుడిని ఉద్దేశించి అంటాడు.
దానికి బాలుడు ఎంతో సులభంగా లెక్క చెబుతాడు.
వెంటనే మహేష్ బాబు.. సూపర్రా, మన ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం బ్రిలియంట్ అన్నయ్యా, అంటాడు.
చివరలో మీ పిల్లలు నేర్చుకునేందుకు ఓ కొత్త పద్ధతిని అందించండి. బైజూస్ డౌన్‌లోడ్ చేసుకోండి అని మహేష్ బాబు చెబుతాడు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications