For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడో రోజూ ఏడుపే..!! 500 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

By Chanakya
|

స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఏడో రోజు కూడా ఏడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేడ్ టెన్షన్స్ - దేశీయంగా అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కుప్పకూల్చింది. నిఫ్టీ కీలకమైన 11400 పాయింట్ల స్థాయిని కూడా బ్రేక్ చేసి కిందికి రావడం మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. హెవీ వెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా మూడో రోజు కూడా పతనం కావడం టెన్షన్‌ను పెంచుతోంది. నిఫ్టీలో ఏ ఒక్క సెక్టోరల్ సూచీ కూడా లాభపడలేదు. ఈ రోజు ట్రేడ్‌లో బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్స్, రియాల్టీ, ఫార్మా, మీడియా కౌంటర్లలో అత్యధిక అమ్మకాల ఒత్తిడి మరింత నీరసాన్ని కలుగ చేసింది. చివరకు నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో 11,359 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 490 పాయింట్లు కోల్పోయి 37,790 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 294 పాయింట్ల నష్టంతో 28995 వద్ద స్థిరపడింది.
యూపీఎల్, జెఎస్‌డబ్లు స్టీల్, బిపిసిఎల్, టైటాన్, కోల్ ఇండియా స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ లూజర్స్ జాబితాలో చేరాయి.

మూడు రోజుల్లో 1000 పాయింట్ల పతనం

గత మూడు రోజులుగా మార్కెట్లలో ఎవరూ ఊహించనంత పతనం నమోదవుతోంది. ఈ మూడు సెషన్లలో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1000 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 400 పాయింట్ల వరకూ పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ స్టాక్ 10 శాతం వరకూ కోల్పోయింది. ఇంతకాలం మార్కెట్లకు అండగా నిలిచిన రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ టి ట్విన్స్, బజాజ్ ట్విన్స్ కూడా కాస్త నీరసించాయి. దీంతో మార్కెట్లలో షార్ట్ టర్మ్ వీక్‌నెస్ ఉండొచ్చని టె్కనికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Markets upadates: Sensex plunges 490 pts, Nifty ends at 11,359

క్యా హువా ''జీ..''

జీ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలోనూ పతనం భారీగా ఉంది. నిన్న కూడా ఏకంగా 10 శాతానికి పైగా పతనమైన జీ.. ఈ రోజు అదే స్థాయిలో పడిపోయింది. తనఖాలో ఉన్న షేర్లను ఎవరూ అమ్మలేదని, డీల్ ప్రాసెస్ త్వరలో పూర్తవుతుందని యాజమాన్యం ప్రకటించినప్పటికీ ప్రయోజనంలేదు. ఇంట్రాడేలో స్టాక్ రూ.321 కనిష్ట స్థాయికి పడిపోయింది. భారీ వాల్యూమ్స్‌తో సహా స్టాక్ ఈ రోజు కూడా 15 శాతం వరకూ పడింది. ఆఖరికి రూ.332 దగ్గర ముగిసింది. ఈ నెల మూడో వారంలో ఆర్థిక ఫలితాలను సంస్థ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.
ఇదే బాటలో మరో మీడియా సంస్థ సన్ టీవీ కూడా వరుస పతనాలతో కుదేలవుతోంది. ఈ స్టాక్ మరో 5 శాతం పతనమైన రూ.525 దగ్గర క్లోజైంది.

జెట్‌‌లో మళ్లీ ఆశలు

జెట్ ఎయిర్‌లో వాటాలు కొనుగోలుకు, ఆర్థికంగా ఆదుకునేందుకు రెడీగా ఉన్నామంటూ బ్రిటన్‌కు చెందిన అట్మాస్‌పియర్‌ ఎయిర్‌లైన్స్‌ సిద్ధంగా ఉందనే వార్తలు స్టాక్‌లో యాక్టివిటీ పెంచాయి. అట్మాస్‌పియర్‌తో పాటు నరేష్ గోయెల్, మలార్ హాస్పిటల్స్‌ కూడా రెడీగా ఉందనే వార్తలొచ్చాయి. దీంతో ఈ స్టాక్ 3 శాతం పెరిగి రూ.131.35 దగ్గర స్టాక్ క్లోజైంది.

ఎడిల్వైజ్ హై జంప్

ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఎడిల్వైజ్.. వాల్యూమ్స్‌తో సహకారిగా పెరిగింది. స్పష్టమైన కారణాలు ఇంకా తెలియకపోయినప్పటికీ స్టాక్ ఏకంగా 7 శాతానికిపైగా పెరిగింది. చివరకు రూ.146.75 దగ్గర క్లోజైంది.

నియోజన్ బంపర్ లిస్టింగ్

తాజాగా వచ్చిన నియోజన్ ఐపీఓ 17 శాతం ప్రీమియంతో రూ.251 దగ్గర లిస్ట్ అయింది. రూ.215 ఇష్యూ ప్రైస్‌తో వచ్చిన ఈ స్టాక్ ఇంతటి బలహీన మార్కెట్ కండిషన్స్‌లో కూడా మంచి ప్రైస్‌ దగ్గర లిస్ట్ అయింది. చివరకు 23 శాతం లాభంతో రూ.263.55 దగ్గర క్లోజైంది.

వోడా ఐడియా.. రికార్డ్ కనిష్టం

వోడాఫోన్ ఐడియా స్టాక్ నానాటికీ కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఇంట్రాడేలో మరింత పతనమైన స్టాక్ వాల్యూమ్స్‌తో నీరసించింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ ఏకంగా 6 రెట్లు పెరిగాయి. దాదాపుగా రైట్స్ ఇష్యూ ధరకు షేర్ పడిపోతూ ఉండడం ఆందోళనను కలిగిస్తోంది. చివరకు స్టాక్ 12 ఏళ్ల కనిష్టానికి దిగొచ్చింది. రూ.14.35 దగ్గర క్లోజైంది.

English summary

ఏడో రోజూ ఏడుపే..!! 500 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్ | Markets upadates: Sensex plunges 490 pts, Nifty ends at 11,359

The BSE Sensex lost 490 points or 1.27 per cent to settle at 37,790 with Reliance Industries (RIL) being the top loser and Asian Paints the biggest gainer. RIL alone contributed around 153 points to the Sensex's fall.
Story first published: Wednesday, May 8, 2019, 17:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X