For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శాలరీ నుంచి పార్కింగ్ ఫీజు కట్, ఎందుకంటే?

|

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లోని తమ ఉద్యోగులకు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తోందా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల శాలరీ నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తోందట. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సాఫ్టువేర్ దిగ్గజం ఒక్కో ఉద్యోగి వద్ద కారు అయితే రూ.500, బైక్ అయితే రూ.250 పార్కింగ్ ఫీజు కింద శారలీలో డిడక్ట్ చేస్తోందట.

లోన్ తీసుకున్నారా.. ప్రభుత్వం బంపరాఫర్!: రూ.60వేల రుణమాఫీలోన్ తీసుకున్నారా.. ప్రభుత్వం బంపరాఫర్!: రూ.60వేల రుణమాఫీ

పార్కింగ్ ఫీజు వసూలు

పార్కింగ్ ఫీజు వసూలు

నేను ఆఫీస్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉంటానని, నేను నా ఫోర్ వీలర్ పైన కార్యాలయానికి వస్తానని, ఇందుకు గాను తన తన శాలరీ అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తున్నారని, ఈ అంశంపై తాము అంతర్గతంగా లేవనెత్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉద్యోగి చెప్పారట. పార్కింగ్ ఫీజు కింద వసూలు చేసే డబ్బు వెల్ఫేర్ ట్రస్ట్ లేదా ఫండ్‌కు వెళ్తుందని చెప్పారని మరో ఉద్యోగి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇది చట్ట విరుద్ధమని వాదన

ఇది చట్ట విరుద్ధమని వాదన

పార్కింగ్ ఫీజు కింద శాలరీ డిడక్ట్ అంశం ది ఫోరమ్ ఫర్ అగైనెస్ట్ కరప్షన్ యాక్టివిస్ట్ విజయ్ గోపాల్ దృష్టికి వచ్చింది. ఇతను గతంలో తెలంగాణ ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ ది లేబర్ డిపార్టుమెంట్‌లో పని చేశారు.

ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఈజెడ్)లో ఉందని, కాబట్టి చాలా మినహాయింపులు ఉంటాయని, ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని, కానీ ఈ విషయం తెలిసి (పార్కింగ్ డిడక్షన్) తాను షాకయ్యానని, ఈ అంశంపై సెజ్ అథారిటీ కలుగజేసుకోవాలని కోరుతున్నానని విజయ్ గోపాల్ అన్నారు. అదే విధంగా జీవో 63 ప్రకారం పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్నారు.

ఇన్ఫోసిస్ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారంటే

ఇన్ఫోసిస్ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారంటే

దీనిపై ఇన్ఫోసిస్ స్పోక్స్ పర్సన్ కూడా స్పందించారని పేర్కొంటున్నారు. పార్కింగ్ ఫీజును తాము కమర్షియల్ యాక్టివిటీ కోసం ఉపయోగించడం లేదని, అందుకే జీవో 63 తమకు వర్తించదని పేర్కొన్నారు. దీనిని ఉద్యోగుల కోసమే వినియోగిస్తున్నామన్నారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేతనం నుంచి డిడక్షన్ అయ్యే ఛార్జీలు (పార్కింగ్ ఛార్జీ) ఎంప్లాయీ వెల్ఫేర్ ట్రస్ట్‌కు ఫండ్‌గా వెళ్తుందని, ఈ ఫండ్‌ను మెయింటెనెన్స్ కోసం, పార్కింగ్ సౌకర్య నిర్వహణ కోసం వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధి నుంచి సంస్థకు ఎలాంటి లాభం లేదన్నారు. ఛార్జీలపై ఫిర్యాదులు ఉద్దేశ్యపూర్వకం మరియు అల్పమైనపనిగా అభివర్ణించారు.

English summary

హైదరాబాద్ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శాలరీ నుంచి పార్కింగ్ ఫీజు కట్, ఎందుకంటే? | Infosys makes Hyderabad employees pay for parking, activists say it is against law

After it came to light that employees of IT firm Infosys in Hyderabad have to shell out money to use their company's parking lot, activists have claimed that the practice is against the law.
Story first published: Wednesday, May 8, 2019, 14:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X