పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. మే 6వ తేదీ నాటి ధరలే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ రూ.73, డీజిల్ రూ.66.666, ముంబైలో పెట్రోల్ రూ.78.59, డీజిల్ రూ.69.81, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.77.43, డీజిల్ రూ.72.46, అమరావతిలో రూ.77.13, డీజిల్ రూ.71.81, విజయవాడలో పెట్రోల్ రూ.76.78, డీజిల్ రూ.71.48 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఇటీవల క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో మే 19 లేదా 23వ తేదీ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

పెరిగిన క్రూడాయిల్ ఉపయోగం
2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ దిగుమతి క్రూడ్ ఆయిల్‌పై డిపెండ్ కావడం 83.7 శాతంగా ఉంది. 2015-16లో ఇది 80.6 శాతంగా ఉంది. మూడేళ్లలో మూడు శాతం పెరిగింది. 2015-16లో 202.9 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి చేసుకోగా, 2018-19 నాటికి 226.6 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి చేసుకున్నాం. 2015-16లో భారత్ 65.6 బిలియన్లు డాలర్లు ఇందుకు ఖర్చు చేయగా, 2018-19 నాటికి 114.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చమురు ధర వినియోగంతో పాటు చెల్లింపు మొత్తం పెరిగింది. ఇందుకు క్రూడాయిల్ ధరలు పెరగడమే కారణం.

భారీగా పెరిగిన బ్యారెల్ ధర
బ్యారెల్ క్రూడాయిల్ ధర జనవరిలో రూ.52.40 డాలర్లుగా ఉండగా, మే 3వ తేదీ నాటికి అది 70.70 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ధరలు పెరగడం లేదు. ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ ధరల ప్రభావం రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతుంది.

నెల రోజులుగా ఫ్లాట్‌గా ధరలు
గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. ఓ వైపు ఆయిల్ ధరలు ఈ నెల రోజుల్లో పది శాతం వరకు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఛార్జీలు మాత్రం పెరగలేదు. ఇందుకు ముఖ్యమైన కారణం లోకసభ ఎన్నికలు. మే 19వ తేదీన ఎన్నికలు పూర్తవుతాయి. ఆ రోజున లేదా మే 23వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఆ రోజున కానీ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
More From GoodReturns

పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications