ప్రయివేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. క్వార్టర్ 4లో ఏకీకృత నికర లాభం రూ.1,170 కోట్లు ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలానికి రూ.1,141 కోట్లుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ క్వార్టర్ 4లో 5 శాతం రూ.969 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి రూ.1,020 కోట్లు ఉంది. ఏకీకృత నెట్ ప్రాఫిట్ రూ.33,.760 కోట్ల నుంచి రూ.36,784కోట్లకు పెరిగింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.6,022 కోట్ల నుంచి రూ.7,620 కోట్లకు పెరిగింది. వడ్డీయేతర ఆదాయం రూ.5,679 కోట్ల నుంచి 36 శాతం తగ్గి, రూ.3,621 కోట్లకు పరిమితమైంది.
జనవరి నుంచి మార్చి మధ్య బ్యాడ్ లోన్స్ కారణంగా మార్చి క్వార్టర్ నెట్ ప్రాఫిట్ తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంకు రుణాలు అంతకుముందు క్వార్టర్‌లో రూ.4,244 కోట్లుగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,451గా ఉన్నాయి. గత ఏడాది మార్చి త్రైమాసికాంలో రూ.6,625 కోట్లు కేటాయింపులతో మాత్రం తగ్గింది. నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతం నుంచి 3.72 శాతానికి పెరిగింది. ఐసీఐసీఐ నికర వడ్డీ ఆదాయం 27శాతం పెరిగి రూ.7,620 కోట్లుగా నమోదు అయింది.

ఐసీఐసీఐ బ్యాంక్ ఆస్తుల నాణ్యత స్వల్పంగా మెరుగైంది. ఈ మార్చి 31 నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) మొత్తం ఆస్తుల్లో 6.70 శాతానికి తగ్గాయి. గత ఏడాది ఇదే సమయానికి స్థూల ఎన్పీఏలు 8.84 శాతంగా నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే, నికర ఎన్పీఏలు సైతం 4.77 శాతం నుంచి 2.06 శాతానికి తగ్గాయి. ఎన్పీఏల్లో ఇది 13 త్రైమాసికాల కనిష్ఠ స్థాయి. ఈ మార్చి త్రైమాసికంలో మరో రూ.3,547 కోట్లు మొండి పద్దులోకి చేరాయి. బ్యాడ్ లోన్‌లు, హయ్యర్ ఎక్స్‌పెన్సెస్ కూడా ప్రాఫిట్ తగ్గడానికి కారణం. ఎక్స్‌పెన్సెస్ 18.1 శాతం పెరిగి రూ.14,680 కోట్లకు చేరింది.


Click it and Unblock the Notifications