మారుతీ సుజుకీ తర్వాత, ఇప్పుడు టాటా మోటార్స్ కూడా చిన్న వేరియంట్ డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. త్వరలో బీఎస్ VI ప్రమాణాలతో కూడిన వాహనాలు తయారు చేయాల్సిన అవసరం నేపథ్యంలో, అవి ఖర్చుతో కూడుకున్నవని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. టాటా మోటార్స్ 1 లీటర్ ఇంజిన్ కలిగిన హ్యాచ్ బ్యాక్ మోడల్ టియాగో, 1.05 లీటర్ కాంపాక్ట్ సెడాన్ ఇంజిన్‌తో టైగర్, వీటితో పాటు పాత మోడల్స్ బోల్ట్, జెస్ట్‌లు కూడా ఉన్నాయి. వీటి తయారీని నిలిపేయనున్నట్లు చెప్పారు. ప్రాథమిక, మధ్యస్థాయి డీజిల్ వాహనాలకు సరైన డిమాండ్ లేదని, చిన్న ఇంజిన్ కలిగిన వాహనాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. నిన్న మారుతీ సుజుకీ, నేడు టాటా మోటార్స్.. డీజిల్ ఇంజన్లను నిలిపివేయనున్నట్లు ప్రకటన చేయడం గమనార్హం. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

డీజిల్ కార్లకు నో.. కారణాలెన్నో
మైలేజీ, ధరల పరంగా చూస్తే పెట్రోల్ కంటే డీజిల్ మెరుగు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది డీజిల్ కార్లను కొనుగోలు చేసి, వినియోగిస్తున్నారు. అయితే భవిష్యత్తు మాత్రం పెట్రోల్, విద్యుత్ కార్లదే అని చెబుతున్నారు. వ్యయం పెరగడంతో పాటు పర్యావరణ సహిత వాహనాలపై ప్రభుత్వాలు దృష్టి సారించడం కూడా కారణమే. కాలుష్యం అంశాన్ని ప్రభుత్వాలు, కోర్టులు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇందులో భాగంగా డీజిల్ ఇంజిన్ల వినియోగానికి అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో బీఎస్ VI నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. అంతేకాకుండా 2022 నుంచి కఠిన చర్యలు అమల్లోకి రానున్నాయి.

పెట్రోల్, సీఎన్జీ కార్ల వైపు మొగ్గు
రియల్ డ్రైవింగ్ ఎమన్షన్ పరీక్షలు కూడా అమలు చేయనున్నారు. ఈ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ తయారు చేయాలంటే భారీగా పెట్టుబడి కావాలి. దీంతో డీజిల్ ఇంజిన్ల తయారీకి రూ.1.25 లక్షలు, అంతకు మించి పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ కార్ల మధ్య రూ.2.5 లక్షల వరకు వ్యత్యాసం ఉండవచ్చు. అందుకే సీఎన్జీ లేదా పెట్రోల్ కార్ల వైపు మొగ్గు చూపే అవకాశముందని చెబుతున్నారు. భారత్‌లో విక్రయాలు చేపట్టాలనుకునే కార్ల సంస్థలు కూడా పెట్రోల్, సీఎన్జీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ప్రస్తుతం 80 శాతం డిమాండ్ పెట్రోల్ వేరియంట్స్‌కు ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీజిల్ వేరియంట్ కోసం అదనపు పెట్టుబడులు అనవసరమని అభిప్రాయపడుతున్నారు.

డీజిల్ స్థానంలో విద్యుత్ వాహనాల హవా
ప్రస్తుతం డీజిల్ ఇంజిన్లకు గిరాకీ తగ్గినట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది నుంచి వీటి గిరాకి తగ్గుతుందని బ్లూమ్‌బెర్గ్ ఓ సర్వేలో పేర్కొంది. అదే సమయంలో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరగనుందని పేర్కొంది. 2024 నాటికి ఈ వాహనాలు మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తాయని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తు అంతా విద్యుత్ వాహనాలదే అంటున్నారు. కాలుష్యంపై రోజు రోజుకు ఆందోళన పెరుగుతోంది. ఢిల్లీలో కాలుష్యం పెరగడంతో సరి - బేసి చేపట్టిన విషయం తెలిసిందే. Bharat Stage VI (BS-VI) ఉద్గార ప్రమాణాలు దేశంలో ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి రానున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications