M-Cap: టీసీఎస్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ సహా 6 కంపెనీల నష్టం రూ.64,219కోట్లు
టాప్ 10 మోస్ట్ వ్యాల్యూడ్ ఇండియన్ కంపెనీలలో ఆరు కంపెనీలు గత వారం 64,219.2 కోట్ల నష్టాలను చవి చూశాయి. ఇందులో ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా ఎక్కువగానే క్షీణించింది. ఐటీసీ, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఉన్నాయి. గత వారంలో వీకెండ్ శుక్రవారం నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహింద్రా బ్యాంకులు లాభపడ్డాయి. టాప్ 6 కంపెనీల నష్టం విలువ 64వేల కోట్లకు పైగా ఉంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.39,700.2 కోట్లు తగ్గి, 8,00,196.04 కోట్లుగా ఉంది. - హెచ్‌యూఎల్ 11,029,.2 కోట్లు తగ్గి రూ.3,66,441.16 కోట్లుగా ఉంది. ఇన్ఫోసిస్ రూ.5,832.53 కోట్లు తగ్గి రూ.3,16,201.41 కోట్లుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు రూ.35,58.82 కోట్లు తగ్గి రూ.2,59,087.06 గా ఉంది. ఎస్బీఐ రూ.2,811.25 తగ్గి రూ.2,75,904.37 కోట్లుగా ఉంది. ఐటీసీ రూ.1,287.15 తగ్గి రూ.3,72,172.06 కోట్లుగా ఉంది.

అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.25,492.79 పెరిగి, రూ.6,45,508.46గా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.9,888.45 కోట్లు పెరిగి రూ.8,91,893.89గా, కొటక్ మహీంద్రా బ్యాంక్ రూ.7,654.43 పెరిగి రూ.2,70,701.52గా, హెచ్‌డీఎఫ్‌సీ రూ.6,102.5 కోట్లు పెరిగి రూ.3,46,008.92గా ఉంది.
ఈ పది టాప్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ,క ఇన్ఫోసిస్, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications