For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI కొరడా: ఫోన్‍‌పే, వొడాఫోన్ ఎం-పేసా సహా పలు పేమెంట్ యాప్స్‌కు భారీ ఫైన్

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఐదు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ) మనీ యాప్‌లకు షాకిచ్చింది. నిబంధనలు సరిగా పాటించలేదని నగదు లావాదేవీలు జరిపే యాప్‌లు, వెబ్‌సైట్లపై భారీ జరిమానా విధించింది. పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్ చట్టం 2007 ప్రకారం ఈ సంస్థలకు జరిమానాలు విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.

వొడాఫోన్‌ ఎం-పేసాకు రూ.3.05 కోట్లు, మొబైల్ పేమెంట్స్‌కు రూ.1 కోటి, ఫోన్‌పేకు రూ.1 కోటి, ప్రయివేట్ అండ్ జీఐ టెక్నాలజీకు రూ.1 కోటి జరిమానా విధించింది. వై-క్యాష్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కి రూ. 5 లక్షలు, అమెరికా సంస్థలు వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌కు రూ.29,66 లక్షలు, మనీగ్రాంకు రూ.10.11 లక్షల జరిమాన విధించింది.

వినియోగదారులకు సేవలు అందించే విషయంలో ఏ సంస్థ అయినా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆ సంస్థపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఉపేక్షించేది లేదని ఆర్బీఐ ప్రకటించింది.

SBI, HDFC, ICICI మినిమం బ్యాలెన్స్: పెనాల్టీ తప్పించుకోండి!SBI, HDFC, ICICI మినిమం బ్యాలెన్స్: పెనాల్టీ తప్పించుకోండి!

RBI slaps penalty on Vodafone m-pesa, PhonePe and 3 others

ఇదిలా ఉండగా, ఆర్బీఐ నియమ నిబంధనలు లేకుండా తాము ఎలాంటి పే-యాప్ తీసుకురామని వాట్సాప్ రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తమ పేమెంట్ సర్వీస్ ట్రయల్ రన్ కొనసాగుతోందని, ఇది ఈ ఏడాది జూలై చివరి నాటికి పూర్తి కావొచ్చునని తెలిపింది. మెస్సేజింగ్ ప్లాట్‌ఫారం వాట్సాప్ తీసుకువచ్చే పేమెంట్ యాప్ ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై వాట్సాప్ అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టత ఇచ్చింది.

English summary

RBI కొరడా: ఫోన్‍‌పే, వొడాఫోన్ ఎం-పేసా సహా పలు పేమెంట్ యాప్స్‌కు భారీ ఫైన్ | RBI slaps penalty on Vodafone m-pesa, PhonePe and 3 others

The RBI Friday said it has imposed penalties on five prepaid payment instrument (PPI) issuers, including Vodafone m-pesa and PhonePe, for violation of regulatory norms. Also, penalties have been imposed on Western Union Financial Services Inc and MoneyGram Payment Systems Inc, both US firms, for non-compliance of guidelines.
Story first published: Sunday, May 5, 2019, 11:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X