చాలామంది భారతీయులు తమ పెట్టుబడులను ఎక్కువగా లండన్‌లో పెట్టినట్లు ఓ తాజా నివేదిక వెల్లడించింది. భారత పెట్టుబడిదారులకు లండన్ టాప్ ఛాయిస్‌గా నిలిచిందని ఆ రిపోర్టు పేర్కొంది. ఆ తర్వాత దుబాయ్, సింగపూర్‌లలో ఎక్కవమంది భారతీయులు ఇన్వెస్ట్ చేసినట్లు ఆ లండన్ & పార్ట్‌నర్స్ నివేదిక తెలిపింది.
యూకేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా భారత్‌నుంచే వచ్చినట్లు ఆనివేదిక వెల్లడించింది. మొత్తం 52 ప్రాజెక్టుల్లో భారతీయులు ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 51 అమెరికన్ ప్రాజెక్టులు, 32 దుబాయ్ ప్రాజెక్టుల్లో అధిక సంఖ్యలో భారతీయులు ఇన్వెస్ట్ చేసినట్లు నివేదిక వెల్లడించింది. 2017వ సంవత్సరంతో పోలిస్తే 2018లో లండన్ సంస్థల్లోకి భారతీయ ఎఫ్‌డీఐలు 255 శాతం పెరిగినట్లు ఎల్ అండ్ పీ నివేదిక తెలిపింది.

ఇక పెట్టుబడుల పరంగా చూస్తే యూకేలోకి భారత్ నుంచి పెట్టుబడులు 100శాతం పెరిగినట్లు ఆ నివేదిక వెల్లడించింది. తమ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించాలన్న ఉద్దేశంతో చాలామంది భారతీయులు లండన్‌ను ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు లండన్ అండ్ పార్టనర్స్ సంస్థ సీఈఓ లౌరా సిట్రాన్ అన్నారు. సోమవారం నుంచి నాలుగురోజుల పాటు భారత్‌లో ట్రేడ్ మిషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మరిన్ని భారత కంపెనీలను ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు ఆ కంపెనీలతో జతకట్టి ముంబై, బెంగళూరు, చెన్నైలాంటి నగరాల్లో ఫిన్‌టెక్, ఎంటర్‌ప్రెజెస్ టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గత 10ఏళ్లలో భారత్ కంపెనీలు లండన్‌లో దాదాపు 2.49 బిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టాయి. దీంతో దాదాపు 5691 ఉద్యోగాల కల్పన జరిగినట్లు నివేదిక వెల్లడించింది. 2018లో లండన్‌లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఓలా, ఓయో లాంటి ప్రముఖ కంపెనీలు ఉన్నట్లు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications