SBI కస్టమరా?: ఫస్ట్ కనెక్టెడ్ ఎస్‌యూవీ హ్యుండాయ్ వెన్యూ కొనుగోలు చేస్తే మరో కారు ఫ్రీ!
హ్యాండాయ్ మోటార్ ఇండియా త్వరలో సరికొత్త ఎస్‌యూవీ వెన్యూను తీసుకురానుంది. ఈ కారు బుకింగ్స్‌ను ప్రారంభించింది. కొత్త ఎస్‌యూవీ కస్టమర్లను ఆకర్షిస్తోందని, ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తామని కంపెనీ చెబుతోంది. కస్టమర్లకు మంచి గ్లోబల్ ప్రొడక్ట్స్‌ను అందించాలనే అంకితభావానికి వెన్యూ ఓ ఉదాహరణ అని హ్యుండాయ్ మోటార్ ఇండియా చెబుతోంది.
ఈ కారు బుకింగ్స్ మే 2వ తేదీన ప్రారంభమయ్యాయి. 20 మే వరకు కొనసాగుతాయి. హ్యుండాయ్ వెన్యూ ఇండియా ఫస్ట్ కనెక్టెడ్ ఎస్‌యూవీ. హ్యుండాయ్ ఆసక్తికర అనౌన్స్‌మెంట్ చేసింది. SBI ద్వారా ఈ ఆఫర్ ఉండనుంది. ఆన్‌లైన్‌లో ఎస్‌యూవీ హ్యుండాయ్ వెన్యూ కొనుగోలు చేయవచ్చు. SBI యోనో యాప్ ద్వారా కొనుగోలు చేస్తే మరో కారు గిఫ్ట్‌గా పొందే అవకాశం కూడా ఉంది. SBI యోనో స్కీం 2 మార్చి నుంచి 30 జూన్ వరకు అందుబాటులో ఉండనుంది.

ఎస్‌యూవీ హ్యుండాయ్ వెన్యూ మోడల్‌ని ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదా డీలర్స్ వద్ద బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ అమౌంట్ రూ.21,000. మారుతి వితారా బ్రెజా, టాటా నెక్సన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300కు ఇది పోటీ ఇవ్వనుంది. ఈ కారు 4 వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 1.4 లీటర్ డీజిల్, 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ రూపంలో అందుబాటులోకి రానుంది. మే 21వ తేదీన ఈ కారును లాంచ్ చేయనుంది.
ఇందులో బ్లూలింక్ టెక్నాలజీని అమర్చనుంది. 33 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కనెక్టెడ్ ఫీచర్స్ ఉండనున్నాయి. కంపెనీ నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం వొడాఫోన్ ఐడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్, ఎయిర్ ప్యూరిఫయర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్లున్నాయి.


Click it and Unblock the Notifications