For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడో రోజూ నష్టాలపాలు! బ్యాంక్ స్టాక్స్‌‌లో మాత్రం రికార్డ్ ర్యాలీ

By Chanakya
|

వారాంతంలో స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదుడుకుల మధ్య కదలాడి చివరకు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి మిడ్ సెషన్ వరకూ పాజిటివ్‌గానే కదలాడినప్పటికీ మిడ్ సెషన్ తర్వాత మాత్రం ఆ పట్టును కొనసాగించలేకపోయాయి. ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కిందికి తీసుకువచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్ మిడ్ సెషన్ తర్వాత ఇంట్రాడే కనిష్ట స్థాయిలకు దిగిరావడం కూడా నీరసపర్చింది. అటు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ స్టాక్స్ మద్దతు ఇచ్చినప్పటికీ నిఫ్టీ మాత్రం 12 పాయింట్ల నష్టంతో 11,712 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 18 పాయింట్లు కోల్పోయి 38,963 దగ్గర ముగిసింది. ఈ రోజు ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ మార్కెట్లను లీడ్ చేసింది. చివరకు 245 పాయింట్ల లాభంతో 29954 దగ్గర ముగిసింది.

రంగాల వారీగా చూస్తే... ఎఫ్ఎంసిజి, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా రంగ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. అదే సమయంలో పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, రియాల్టీ, ఆటో స్టాక్స్‌ మాత్రం ఉత్సాహంగా పరుగులు తీశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం పెరిగితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం నష్టపోయింది.

<strong>అక్షయ తృతీయ ఎఫెక్ట్: 20 శాతం పెరిగిన బంగారం ఇంపోర్ట్స్</strong>అక్షయ తృతీయ ఎఫెక్ట్: 20 శాతం పెరిగిన బంగారం ఇంపోర్ట్స్

Markets close: Sensex, Nifty end flat on a choppy day

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రికార్డ్స్

ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థ స్టాక్ వరుసగా నాలుగో రోజు కూడా లాభాల్లో ముగిసింది. రూ.2378 ఆల్ టైం గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్ చివర్లో కొద్దిగా నీరసించింది. అయినా అర శాతం లాభాలతో రూ.2369 దగ్గర ముగిసింది.
ఇదే బాటలో మరో ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. చివరకు రూ.1418 దగ్గర క్లోజైంది.

రుచి.. టేస్టీ గెయిన్స్

అప్పుల్లో కూరుకుపోయిన రుచి సోయా సంస్థను కొనుగోలు చేసేందుకు పోటీపడిన పతంజలి సంస్థ రిజల్యూషన్ ప్లాన్‌కు రుణదాతల నుంచి ఆమోదం లభించింది. దీంతో రుచి సోయా స్టాక్ ఏకంగా 10 శాతం లాభపడింది. గత కొన్ని రోజుల నుంచి ఈ స్టాక్‌లో పాజిటివ్ యాక్టివిటీ కనిపిస్తోంది. చివరకు ఈ స్టాక్ రూ.8.93 దగ్గర క్లోజైంది.

కాగ్నిజెంట్ ఎఫెక్ట్

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తన గైడెన్స్‌ను అమాంతం తగ్గించింది. ఈ ఆర్థిక ఏడాదిలో 7-9 శాతం వరకూ వృద్ధి ఉంటుందని అంచనా కట్టిన సంస్థ దాన్ని తాజా 3-5 శాతానికి మాత్రమే పరిమితం చేసింది. దీంతో ఇది దేశీయ ఐటీ స్టాక్స్‌పై నెగిటివ్ ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది ఐటీ కంపెనీలకు ప్రధానంగా అమెరికా వంటి ప్రముఖ మార్కెట్ల నుంచి ఆర్డర్లు అంతంతమాత్రమని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో దేశీయ ప్రముఖ ఐటీ స్టాక్స్‌ కూడా కుదేలయ్యాయి. టీసీఎస్ ఏకంగా 4 శాతం వరకూ పతనం కాగా, ఇన్ఫోసిస్ - టెక్ మహీంద్రా వంటి స్టాక్స్ 2 శాతం వరకూ పతనమయ్యాయి.

వాల్యూమ్ షాకర్స్

గుజరాత్ ఆల్కలీస్ స్టాక్ ఇంట్రాడేలో 8 శాతం వరకూ పెరిగింది. చివరకు 7 శాతం లాభాలతో రూ.525 దగ్గర క్లోజైంది. ట్రేడింగ్ వాల్యూమ్ ఏకంగా 9 రెట్లు పెరిగింది.
బ్లూస్టార్ - ఈ స్టాక్ కూడా ఇంట్రాడేలో 5 శాతం వరకూ పెరిగింది. చివరకు 2.5 శాతం లాభాలతో రూ.697 దగ్గర క్లోజైంది. ట్రేడింగ్ వాల్యూమ్స్ 13 రెట్లు పెరిగాయి.
మిందా కార్ప్ - ఈ స్టాక్ 4.5 శాతం వరకూ నష్టపోయింది. చివర్లో కొద్దిగా కోలుకున్నప్పటికీ 2 శాతానికిపైగా నష్టాలు నమోదయ్యాయి. ట్రేడింగ్ వాల్యూమ్ కూడా 12 రెట్లు పెరిగాయి. స్టాక్ రూ.122 దగ్గర క్లోజైంది.

52 వారాల గరిష్టానికి

మార్కెట్ సూచీలు గత కొద్ది కాలం నుంచి కన్సాలిడేషన్‌లో కొనసాగుతున్నా.. కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో మాత్రం జోరు కొనసాగుతూనే ఉంది. ఆవాస్ ఫైనాన్షియర్స్, బజాజ్ ఫైనాన్స్, బల్‌రాంపూర్ చీనీ, బాటా ఇండియా, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఐసిఐసిఐ లాంబార్డ్, కొటక్ బ్యాంక్, పివిఆర్, వినతి ఆర్గానిక్స్ వంటి స్టాక్స్ ఈ జాబితాలో చేరాయి.

English summary

మూడో రోజూ నష్టాలపాలు! బ్యాంక్ స్టాక్స్‌‌లో మాత్రం రికార్డ్ ర్యాలీ | Markets close: Sensex, Nifty end flat on a choppy day

The S&P BSE Sensex settled 18 points lower for the day at 38,963, with TCS, Hindustan Unilever, TATA Steel, HCL Tech and Infosys dragging the index down. Twelve out of the 30 constituents of the BSE ended the day in red, while the rest settled in green.
Story first published: Friday, May 3, 2019, 17:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X