ఢిల్లీ: ఫని తుఫాను ఒడిశా సహా తీర ప్రాంత ప్రాంతాలను వణికిస్తోంది. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఫని తుఫాను ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపింది. పలు విమానాశ్రయాల్లో ప్రయాణీకులు చిక్కుకుపోయారు. ఒడిసశా రాజధాని భువనేశ్వర్, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలు ఉండవని ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ వెల్లడించింది. ప్రయాణీకుల భద్రత కోసం, వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. పరిస్థితి సద్దుమణిగాక విమానాల రాకపోకలు ఉంటాయని తెలిపింది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన ప్రయాణీకులు చిక్కుకుపోగా, వారికి అకామిడేషన్ నిరాకరించారని తెలుస్తోంది. ఫని తుఫాను కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయని, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్, అందుకే ప్రయాణీకులకు అకామిడేషన్ కల్పించలేమని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారని తెలుస్తోంది.

అంతకుముందు రోజు కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఫని తుఫాను అంశంపై స్పందిస్తూ... అన్ని విమానయాన సంస్థలు ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఫని తుఫాను కారణంగా చిక్కుకుపోయిన వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు. ప్రయాణీకులకు అన్ని విమానయాన సంస్థలు సౌకర్యం కల్పించాలన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications