ఇండియా కారు స్టాక్స్ గత పదహారు నెలల్లో 42బిలినయ్ డాలర్ల నష్టాన్ని చవి చూశాయి. డిసెంబర్ 2017 నుంచి ఆటోమొబైల్స్ కంపెనీలు 30 శాతం నష్టపోయాయి. ఏడాది కాలంలో భారత ఈక్విటీ మార్కెట్లోని 19 కీలక సెక్టార్లలో అత్యంత నష్టాన్ని చవిచూసిన రంగం ఆటోమొబైల్. అంతకుముందు ఏడాది వరకు ప్రపంచంలోనే ఫాస్ట్‌గా పెరుగుతున్న ఆటో మార్కెట్‌గా భారత్ నిలిచింది.
కానీ బ్యాంకింగ్ సిస్టంలో క్యాష్ క్రంచ్ కూడా కార్‌మేకర్స్‌కు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, మహింద్రా అండ్ మహింద్రా వంటి దిగ్గజ సంస్థలు ఈ ఏడాదిలో సెన్సెక్స్‌లో భారీగా క్షీణించాయి. దాదాపు 20 శాతం వరకు ఈ కంపెనీలు నష్టపోయాయి.

మే 2వ తేదీన నోమురా హోల్డింగ్స్ ఇంక్ అనలిసిస్ట్‌లు కపిల్ సింగ్, సిద్ధార్థ బేరాలు దీనిపై స్పందిస్తూ... ఇనిషియల్ ట్రెండ్స్‌ను చూస్తే అనుకున్న దాని కంటే మరింత క్షీణత కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్యాసింజర్స్ వెహికిల్స్ వృద్ధిలో 2014 తర్వాత చాలా తక్కువగా ఉన్నది ఇప్పుడేనని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమోబైల్స్ మాన్యుఫ్యాక్చరర్స్ ద్వారా వెల్లడవుతోంది.
దేశంలో అతిపెద్ద మార్కెట్ షేర్ కలిగిన మారుతి సుజుకీ క్రమంగా క్షీణిస్తోందని, 17 శాతం తగ్గిందని చెబుతున్నారు. ఎస్ అండ్ బీఎస్ఈ ఆటో ఇండెక్స్‌లోని 16 కంపెనీలలో కేవలం 2 మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్ లిమిటెడ్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో పాటు బజాజ్ ఆటో లిమిటెడ్ (11 శాతం వృద్ధి)లకు మాత్రమే ఊరట లభించింది.
గత ఏప్రిల్ నెలలో మారుతి సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీల అమ్మకాలు కూడా బాగానే తగ్గాయి. దేశీయంగా టాటా మోటార్స్ ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలు ఏప్రిల్‌లో 26 శాతం తగ్గి 12,694 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 17,235 వాహనాలను విక్రయించింది. టొయోటా దేశీయ అమ్మకాలు ఏప్రిల్‌లో 22.43 శాతం తగ్గి 13,037 యూనిట్ల నుంచి 10,112 యూనిట్లకు చేరుకున్నాయి. మహేంద్ర అండ్ మహేంద్ర ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలు ఏప్రిల్‌లో 8.94 శాతం తగ్గి 21,927 యూనిట్ల నుంచి 19,966 యూనిట్లకు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 48,097 యూనిట్ల నుంచి 43,721 యూనిట్లకు తగ్గాయి.


Click it and Unblock the Notifications