ఎయిరిండియా విమానం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిధులు సమకూర్చుకునేందుకు ఇది ఏకంగా తమ సిబ్బందికి కేటాయించిన ఫ్లాట్లను ఖాళీ చేయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఫ్లాట్లు ఖాళీ చేయాలని ఢిల్లీలోని వసంత్ విహార్ కాలనీలోని సిబ్బందిని కోరింది. ఇక్కడ ఎయిరిండియా సిబ్బందికి 810 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో 676 ఫ్లాట్లలో సిబ్బంది ఉంటున్నారు.
ఈ ఫ్లాట్ల నుంచి సిబ్బందిని ఖాళీ చేయించి, వాటిని వేలం వేసి నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇక్కడ ఉంటున్న సిబ్బందిని ఖాళీ చేయించినప్పటికీ వారికి ఇళ్లు వెతుక్కోవడంలో సాయం చేస్తామని ఎయిరిండియా ప్రకటించింది. అయితే ఈ ఫ్లాట్లలో ఉంటున్న సిబ్బంది ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారే. పిల్లల పాఠశాలలు సహా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఖాళీ చేయమని చెప్పడం వారికి ఇబ్బందికరంగా మారింది. అలాగే, సంస్థకు చెందిన ప్లాట్లు కాబట్టి రెంట్ కూడా వారికి అందుబాటులో ఉంది. రూ.5వేల నుంచి రూ.25వేల వరకు ఉంది. ఇప్పుడు ఇలాంటి సౌకర్యాలతో ఇళ్లు దొరకడం కష్టంగా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఖాళీ చేయిస్తున్న ఉద్యోగులకు సూటబుల్ అకామిడేషన్ పైన ఓ కమిటీ వేయనున్నారని తెలుస్తోంది. ఉద్యోగులు వెతుక్కున్న సరైన ఇంటికి ఆ ఉద్యోగి తరఫున కంపెనీ లీజింగ్ అగ్రిమెంట్ చేసుకోనుందని తెలుస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications